
కోకాపేట్ – ప్రస్తుతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హాట్ స్పాట్. ఇక్కడే బన్నీ సొంత భూములపై అల్లు స్టూడియోస్ ఉంది. ఇప్పుడు అదే ప్రాంగణంలో అత్యాధునిక థియేటర్‌కి రూపురేఖలు అందుతోంది. 2026 సంక్రాంతికే ఈ థియేటర్ గ్రాండ్ ఓపెనింగ్ చేయాలని బన్నీ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇదే హైదరాబాద్‌లో తొలి డాల్బీ సినిమా అనుభూతి కలిగించే థియేటర్ కాబోతోంది. విజువల్స్, సౌండ్ టెక్నాలజీ పరంగా ఇది దేశంలోనే టాప్‌లో ఉండబోతుందని సమాచారం. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఓఆర్ఆర్ పరిసరాల్లో నివసిస్తున్నవారికి ఇది ఓ మూవీ హబ్లా మారనుంది. ఇప్పటి వరకు మహేష్ బాబు ఎఎంబీ సినిమాస్, పీవీఆర్‌లు మాత్రమే ఉండగా, ఇప్పుడు బన్నీ థియేటర్ ఎంట్రీతో కాంపిటిషన్ రేంజ్ మారిపోనుంది.
ఫ్యామిలీస్‌కి, యూత్‌కి కొత్త డెస్టినేషన్‌గా అల్లు సినీప్లెక్స్ గా నిలవబోతోంది. ఇదిలా ఉంటే, పుష్ప 2 తో మాస్ పీక్స్‌కి వెళ్లిన బన్నీ... ఇప్పుడు తన తర్వాతి మూవీపై దృష్టి పెట్టారు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో వస్తోన్న AAA22XA6 అనే సైంటిఫిక్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి సంబంధించిన షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బాక్సాఫీస్‌పై మరోసారి బన్నీ సునామీ వస్తుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి.. సినిమాల్లోనే కాదు, బిజినెస్‌లోనూ బన్నీ బ్రాండ్ రోజురోజుకీ గ్రో అవుతోంది. స్టార్‌డమ్‌ను స్మార్ట్‌గా మల్టిప్లై చేసుకుంటున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రియల్ మాస్టర్ మైండ్ అంటు ఫిలింనగర్ కోడై కూస్తోంది!