బుల్లితెరపై యాంకర్ గా తన సినీ ప్రస్తానాన్ని  మొదలుపెట్టిన అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలో నటించే స్థాయికి ఎదిగింది.అలాగే కుర్ర హీరోలతో ఐటెం సాంగ్ లకు కూడా రెడీ అయి ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన భర్త గురించి సంచలన విషయాలు బయట పెట్టింది. అయితే చాలామంది అనసూయ భర్తని తెగ ట్రోలింగ్ చేస్తూ ఉంటారట.అసలు అనసూయ అంత హాట్ గా కనిపించినా హీరోలతో రొమాన్స్ చేసినా అలాంటి పాత్ర పోషించిన కూడా ఎందుకు ఆమె భర్త సైలెంట్ గా ఉంటారు. చేతకాని వాడా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారట. అయితే ఈ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ నీ చూసి  మా ఆయనకి నాకు మధ్య ఏం గొడవలు జరగవు అనుకుంటారు. 

అయితే నాకు మా ఆయనకు ఇప్పటికీ గొడవలు జరుగుతేనే ఉంటాయి.మా ఆయన అంత పర్ఫెక్ట్ ఏమి కాదు. అసలు మాకు గొడవలు జరగవు అనుకుంటారు. కానీ మా మధ్య కూడా గొడవలు వచ్చిన సందర్భాలు అనేకం. నేను వేరే హీరోలతో రొమాన్స్ చేయడం మా ఆయనకు నచ్చదు.వేరే వాళ్ళతో సినిమాలు చేసినప్పుడు ఆయన నాతో గొడవ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను గుడ్ లుకింగ్ పీపుల్స్ తో కలిస్తే ఆయన అస్సలు ఓర్వలేడు. ఇక ఈ విషయం తెలియని చాలామంది అనసూయ చాలా లక్కీ ఏం చేసినా భర్త ఏమీ అనడు చేతకాని వాడు కావచ్చు అని కొంతమంది మగవాళ్ళు అనుకుంటారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ చూసి నేను బాధపడే టైంలో నిన్ను ఎవరు చూడమన్నాడు. నేనే సైలెంట్ గా ఉంటున్నా.. నిన్ను నేనంటే పట్టించుకోవాలి. ఎవరో అంటే పట్టించుకోవద్దు వాటిని వదిలేయ్ అని అంటూ ఉంటాడు.

అయితే మా మధ్య ఎన్ని విభేదాలు వచ్చినా కూడా విడాకులు ఎందుకు తీసుకోవడం లేదని మీరందరూ అనుకుంటారు.కానీ పెళ్లి అనేది పర్ఫెక్ట్ కాదు. అలాగని ఎవరు పర్ఫెక్ట్ కాదు. నాకు మా ఆయన మా ఆయనకు నేను రైట్ అంతే. ఇక మన అమ్మకి అన్నకి చెల్లికి విడాకులు ఇస్తామా..కానీ కేవలం పెళ్లి చేసుకున్న భార్యకు, భర్తకు మాత్రమే విడాకులు ఇస్తాం. కానీ ఇలాంటిది నాకు నచ్చదు.ఎందుకంటే మన భారతీయ వ్యవస్థలో పెళ్లి అనే బంధానికి ఎంతో విలువ ఉంది.అలాంటి విలువను విడాకులతో తగ్గించడం నాకు ఇష్టం లేదు.అందుకే ఎన్ని గొడవలు వచ్చిన సర్దుకుపోయేంత ఓపిక ఉండాలి.అయితే ఇప్పటి జనరేషన్ వాళ్లకు అంత ఓపిక అయితే లేదు అలాగే మా ఆయనకు తెలుగు రాదు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్ అర్థం చేసుకోలేడు  అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అనసూయ.

మరింత సమాచారం తెలుసుకోండి: