కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా రూపొందిన కూలీ అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ దర్శకుడు అయినటువంటి లోకేష్ వరుస పెట్టి  ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన వివరాలను తెలియజేస్తూ వస్తున్నాడు. తాజాగా లోకేష్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

అందులో భాగంగా ఈయన కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ తో మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా లోకేష్ , అజిత్ కుమార్ గురించి మాట్లాడుతూ  ... అజిత్ కుమార్ సార్ అంటే నాకు ఎంతో ఇష్టం. సరైన టైం వచ్చినప్పుడు మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఖచ్చితంగా ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇకపోతే కూలీ సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున విలన్ పాత్రలో నటించబోతున్నాడు అనే వార్త బయటకు రావడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీ స్థాయికి చేరిపోయాయి.

శృతి హాసన్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఉపేంద్రమూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమాపై అదిరిపోయే రేంజ్ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి , ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

lk