సాధారణంగా స్టార్ హీరోస్ మిస్టేక్స్ చేయరు. ఒకవేళ మిస్టేక్స్ చేశారు అంటే మాత్రం తెలియకుండా చేయాల్సిందే.  ఏ హీరో అయినా సరే తెలిసి తెలిసి తప్పు చేస్తే మాత్రం ఆ హీరోకి నెక్స్ట్ సోషల్ మీడియాలో చుక్కలు కనిపించేస్తాయి. ఆ విధంగా ట్రోల్ చేస్తారు . అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే . బడా స్టార్ సెలబ్రిటీస్ అయినా సరే . తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే రామ్ చరణ్ పక్క ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ పేరు గ్లోబల్ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకుంది.
 

అంటే రామ్ చరణ్ నెక్స్ట్ ఏ సినిమాని  చూస్ చేసుకున్న ఆ రేంజ్ లోనే ఉండాలి . అల్లాటప్ప కథలను చూస్ చేసుకుంటే వర్క్ అవుట్ అవ్వదు.  అంతేకాదు వేరే ఏ హీరో సినిమాకైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే సినిమా ప్రమోషన్స్ కి అటెండ్ అవ్వాలి అంతేకానీ హీరో కోసం శాక్రిఫైజ్ లు చేసి తన క్యారెక్టర్ హైలెట్ కానీ ఒక గెస్ట్ రోల్ లో నటిస్తే ఖచ్చితంగా అది బిగ్ మైనస్ గా మారుతుంది.  గతంలో "గోవిందుడు అందరివాడేలే" సినిమా రిలీజ్ అయిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని చాలా మంది ట్రోల్ చేశారు . ఇలాంటి ఒక కాన్సెప్ట్ రామ్ చరణ్ కి సూట్ అవ్వదు అని ..మరి ఎందుకు చూస్ చేసుకున్నాడు అని మండిపడ్డారు .



అంతేకాదు "ఆరెంజ్" సినిమా విషయంలో కూడా అలాగే ఫైర్ అయ్యారు.  అయితే ఇప్పుడు రాంచరణ్ మరొకసారి అదే బిగ్ మిస్టేక్ చేయబోతున్నాడు అన్న టాక్ వినిపిస్తుంది.  ప్రజెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో "పెద్ది" సినిమా షూట్ లో బిజీగా ఉన్న రాంచరణ్ ఆ తర్వాత సుకుమార్ సినిమాని  సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు . అయితే ఆ తర్వాత లోకేష్ కనక రాజ్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చాడు రామ్ చరణ్ . కాగా ముగ్గురు కూడా తోపైన డైరెక్టర్లు . మంచి మంచి కాన్సెప్ట్ క్రియేట్ చేసే సత్తా ఉన్న డైరెక్టర్లు . అయితే చరణ్ మాత్రం ఆయనకి నెగిటివ్ షేడ్స్ చేయాలి అని ఆశగా ఉందట . నెగిటివ్ షేడ్స్ లో ఉన్న క్యారెక్టర్ లో కనిపించే విధంగా ప్లాన్ చేయమంటున్నారట . మరీ ముఖ్యంగా యానిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ ఏ విధంగా అయితే మెప్పించాడో అలాంటి ఒక క్యారెక్టర్ కావాలి అంటూ బలవంతం చేస్తున్నారట . ఇది నిజంగా చాలా రిస్క్ . రన్బీర్ కపూర్ కి ఆ కారెక్టర్ సూట్ అయ్యింది.  కాని రామ్ చరణ్ కి అస్సలు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వదు . అలాంటి ఒక డెసిషన్ తీసుకుంటే మాత్రం రామ్ చరణ్ భారీ మూల్యం చెల్లించుకోవాలి.  ఫ్యాన్స్ అలా చేస్తే అస్సలు ఊరుకోరు అంటున్నారు సినీ ప్రముఖులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: