భద్రతా సమస్యలు, ముఖ్యంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వ‌స్తున్న బెదిరింపుల దృష్ట్యా బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ కు జడ్ ప్లస్ కెటగిరీ సెక్యురిటీ ఉంటుందనే సంగతి తెలిసిందే. అలాగే సల్మాన్ ఖాన్ ప‌ర్స‌న‌ల్‌గా కూడా బాడీ గార్డ్స్ ను మెయింటైన్ చేస్తున్నాడు. వారిలో స‌ల్మాన్ బాగా న‌మ్మిన వ్య‌క్తి గుర్మీత్ సింగ్ జాలీ అలియాస్ షేరా. అనునిత్యం స‌ల్మాన్ ను రక్షించే షేరా సెల‌బ్రిటీల‌కు ఏమాత్రం త‌క్కువ కాదు.


ముంబైలోని అంధేరిలో జన్మించిన షేరా 1987లో బాడీబిల్డింగ్‌లో ముంబై జూనియర్ టైటిల్‌ను గెలుచుకున్నారు. 1997లో ఇండోర్‌లో సల్మాన్‌కు సెక్యూరిటీగా షేరాను నియ‌మించారు సోహైల్ ఖాన్. ఆ త‌ర్వాత స‌ల్మాన్‌, షేరా మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది. సోహైల్ కోర‌డంతో స‌ల్మాన్‌కు షేరా ప‌ర్స‌న‌ల్ బాడీగార్డ్‌గా మారాడు. అలాగే మ‌రోవైపు షెరా టైగర్ సెక్యూరిటీ అనే భద్రతా సంస్థను నడుపుతున్నాడు.


2019లో షేరా శివ‌సేన పార్టీలో చేరి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాడు. ఇక షేరా ఆస్తుల వెలువెంతో తెలిస్తే హీరోలు కూడా దిగ‌దుడుపే అంటారు.  ప‌లు నివేదికల‌ ప్ర‌కారం.. షేరా ఆస్తుల విలువ రూ. 100 కోట్లకు పైమాటే. స్టార్ సెల‌బ్రిటీల వ‌ద్ద ఉండే రేంజ్ రోవర్ కారు(రూ. 1.4 కోట్లు)ను సైతం షేరా కలిగి ఉన్నారు. అంత ఆస్తి ఉన్న‌ప్ప‌టికీ స‌ల్మాన్ ఖాన్ ద‌గ్గ‌రే న‌మ్మ‌క‌స్తుడిగా ఉండ‌టం షేరా గొప్ప‌త‌నం. కాగా, స‌ల్మాన్ ఖాన్‌కు బాడీ గార్డ్‌గా షేరా నెల‌కు రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు సాల‌రీ అందుకుంటున్నాడ‌ని స‌మాచారం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: