సోషల్ మీడియాలో నిరంతరం వేల - లక్షల సంఖ్యలో కొన్ని ఫొటోస్ వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే వైరల్ అయ్యే ప్రతి ఫోటో నిజమని కాదు . కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు ఫేక్ గా కూడా ఉంటాయి.  కొన్ని కొన్ని సార్లు స్టార్ సెలబ్రిటీస్ కూడా ఆ విషయంలో పప్పులో కాలేస్తూ ఉంటారు . తాజాగా అలాంటి ఒక సంఘటన చోటుచేసుకుంది . అది కూడా అల్లు అర్జున్ కి సంబంధించి కావడంతో ఈ వార్తను తెగ వైరల్ చేసేస్తున్నారు జనాలు.  మనకు తెలిసిందే అల్లు అర్జున్ అనగానే అందరికీ గుర్తొచ్చేది పుష్ప2. అఫ్ కోర్స్ అల్లు అర్జున్ కెరియర్ లో ఎన్నో ఎన్నో సినిమాలల్లో నటించాడు . కానీ అన్నిటికన్నా ది బెస్ట్ అందరికి గుర్తుండిపోయేది.. ఆయన పేరు మారు మ్రోగిపోయేలా చేసింది మాత్రం పుష్ప 2 సినిమా అని చెప్పాలి.


సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అవుతుంది . అయినా సరే ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్స్ పాటలు సోషల్ మీడియాలో వైరల్  అవుతూనే ఉంటాయి . తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా ట్రెండ్ అయ్యింది.  పుష్ప సాంగ్ తో బి యునిక్ క్రూ అమెరికాస్ గాట్ టాలెంట్ సీజన్ 20 వేదికపై ప్రదర్శన ఇచ్చినట్లు ఒక ఫేక్ వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అయింది . అయితే ఆ వీడియోని బన్నీ ఫ్యాన్స్ ఫుల్ గా షేర్ చేసేసారు.  మా పుష్ప గాడి రూల్ అంటే ఇది అంటూ నానా హంగామ చేశారు .


అల్లు అర్జున్ కూడా వీడియోకి చేసి "వావ్ మైండ్ బ్లోయింగ్" అంటూ కామెంట్ చేశారు . అసలు ఇది నిజమేనా ..? అని ఆరా తీయగా ఇది టోటల్లీ ఫేక్ వీడియో అంటూ ప్రూవ్ అయ్యింది .  ఈ వీడియో కి సంబంధించిన అసలు విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియో ఎడిటెడ్ అని తేలింది . అసలు వీడియోలో ఉంది పుష్ప ట్రాక్ కానే కాదు ..ఇమేజిన్ డ్రాగన్స్ బిలీవర్ ట్రాక్ . ఆ ట్రాక్ కి బి యునిక్ గ్రూప్ డాన్స్ చేసింది . కానీ ఎడిట్ వీడియోలో పుష్ప ట్రాక్ తో ఉండగా అది నెట్టింట వైరల్ అయింది . బన్నీ ఫ్యాన్స్..ఆఖరికి బన్నీ అందరు ఇది నిజమే అనుకోని తెగ మురిసిపోయారు. సోషల్ మీడియాలో వైరల్ చేశారు . ఫైనల్లీ అదంతా ఫేక్ వీడియో అంటూ బయటపడింది . ఎంత పని చేశారురా మీమర్స్ అంటూ బన్నీ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . కొంతమంది పుష్ప రాజ్ ని ఇలా బకరా చేసేసారేంటి ..?? అంటూ కామెడీగా కౌంటర్స్ వేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: