ప్రస్తుతం మెగా హీరోలకు బ్యాడ్ టైమ్‌ బలంగా నడుస్తోంది. భారీ అంచనాల నడుమ వస్తున్న మెగా హీరోల చిత్రాలన్నీ బొక్క బోర్లా పడుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.


అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ `హరి హర వీరమల్లు` ఇటీవ‌లె విడుదలైంది. క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ ఈ మూవీకి దర్శకులు కాగా.. ఏఎం ర‌త్నం నిర్మాత‌గా వ్యహ‌రించారు. అయితే మిక్సిడ్ టాక్ సొంతం చేసుకున్న వీరమల్లు సైతం అనుకున్న స్థాయిలో ఆడలేదు. మొన్న అబ్బాయి.. నేడు బాబాయ్ ఇద్దరికీ బాక్సాఫీస్ వద్ద గట్టి దెబ్బ త‌గిలింది.


మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నుంచి రెండేళ్ల క్రితం `భోళా శంకర్` మూవీ వచ్చింది. ఈ సినిమా రిజల్ట్ గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అదేవిధంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ హిట్ ముఖం చూసి చాలా ఏళ్లు అయిపోతుంది. అత‌ని గ‌త చిత్రాలు `గాండీవదారి అర్జున`, `ఆపరేషన్ వాలంటైన్`, `మ‌ట్కా` మూవీస్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులుగా నిలిచాయి.


ఇక మెగా ఇక మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్‌,  వైష్ణవ్ తేజ్ కూడా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వారే. సాయి ధ‌ర‌మ్ తేజ్ నుంచి చివ‌రిగా వ‌చ్చిన `బ్రో` పెద్ద‌గా ఆడ‌లేదు. వైష్ణ‌వ్ తేజ్ నుంచి వ‌చ్చిన `ఆదికేశవ` కూడా ఫ్లాప్ అయింది. మొత్తంగా మెగా హీరోలంతా ఫ్లాపుల్లో మునిగిపోయారు. మ‌రి వీరు బ్యాడ్ టైమ్ నుంచి బ‌య‌ట‌ప‌డి స‌క్సెస్ ట్రాక్ ఎక్కేది ఎప్పుడో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: