టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు , ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ తో మహేష్ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని , సూపర్ సాలిడ్ రికార్డులను నెలకొల్పుతాడు అని ఆయన అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు.

తాను లైఫ్ ఇచ్చిన ఓ బ్యానర్ లో మహేష్ మరో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో మైత్రి సంస్థ ఒకటి. ఈ సంస్థ మహేష్ బాబు హీరోగా రూపొందిన శ్రీమంతుడు అనే సినిమాతో మొదలయ్యింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ నిర్మాణ సంస్థకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈ బ్యానర్ వారు ఎన్నో సినిమాలను నిర్మించి , అందులో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థగా కొనసాగుతుంది. మహేష్ , రాజమౌళి సినిమా తర్వాత ఏ నిర్మాణ సంస్థలో సినిమా చేయబోతున్నాడు అనే దానిపై ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఆ న్యూస్ ప్రకారం మైత్రి సంస్థలో మహేష్ , రాజమౌళి సినిమా తర్వాత మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ క్రేజ్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి క్రేజ్ వచ్చాక మరోసారి మైత్రి సంస్థలో మహేష్ సినిమా చేయనున్నాడు అనే వార్తలు రావడంతో మైత్రి సంస్థకు ఇది అదిరిపోయే ఆఫర్. అప్పుడు శ్రీమంతుడు సినిమా ద్వారా ఆ నిర్మాణ సంస్థకి లైఫ్ ఇచ్చాడు. రాజమౌళితో సినిమా తర్వాత ఆ బ్యానర్ లో సినిమా చేస్తే ఇది కూడా వారికి సూపర్ ఆఫర్ అవుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

mb