టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. భాగ్య శ్రీ బోర్స్ ఈ సినిమాలో విజయ్ కి జోడిగా నటించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు. సత్యదేవ్ ఈ సినిమాలో విజయ్ కి సోదరుడి పాత్రలో కనిపించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని జులై 31 వ తేదీన విడుదల చేశారు.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్లు లభించాయి. ఆ తర్వాత కూడా ఈ మూవీ కి మంచి కలెక్షన్లు దక్కాయి. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి అనే విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. విజయ్ దేవరకొండ గత కొంత కాలంగా నటించిన చాలా సినిమాలు ఈయనకు భారీ నిరాశనే మిగిల్చాయి.

అలాంటి సమయంలో కింగ్డమ్ సినిమా 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేయడం విజయ్ దేవరకొండ కు పెద్ద ఊరట అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. విజయ్ దేవరకొండ తన తదుపరి మూవీ ని రాహుల్ సంకృతీయన్ దర్శకత్వంలో చేయనున్నాడు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే టాక్సీవాలా సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తదుపరి విజయ్ దేవరకొండ , రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్ధన్ అనే మూవీ లో నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd