టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పెళ్లి చూపులు అనే మూవీ తో హీరో గా కెరియర్ను మొదలు పెట్టి ఈ సినిమాతో మంచి విజయాన్ని ,  మంచి గుర్తింపును విజయ్ దేవరకొండ తెలుగు సినీ పరిశ్రమలో  దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈయన క్రేజ్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో భారీగా పెరిగిపోయింది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈయనకు సరైన విజయాలు దక్కడం లేదు.

తాజాగా ఈయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన కింగ్డమ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. భాగ్య శ్రీ బోర్స్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. సత్యదేవ్ ఈ మూవీ లో అత్యంత కీలకమైన పాత్రలో నటించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమా తాజాగా 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓ టీ టీ స్ట్రీమింగ్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే .. ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను అత్యంత భారీ ధరకు ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాను ఆగస్టు 28 వ లేదా 29 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు  ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా నిజం గానే ఆగస్టు 28 వ లేదా 29 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందా ..? లేదా ..? అనే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd