సోషల్ మీడియాలో జనాలు కొంతమంది ఓవర్ చేస్తూనే ఉంటారు. అందరూ అలా చేస్తారని చెప్పలేము కానీ, ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది స్టార్ హీరోలను ఫాలో అయ్యే వాళ్లు మాత్రం ఇదే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా వార్ 2, కూలీ సినిమాల గురించే చర్చ జరుగుతోంది. కొంతమంది ఏకంగా ఆగస్టు 14వ తేదీకి లీవ్ తీసుకుని కూలీ సినిమా చూడాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది వార్ 2 సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుందని, ఎన్టీఆర్ సినీచరిత్రనే ఈ మూవీ తిరగరాస్తుందని ఓవర్‌గా ఎగ్జైట్ అవుతున్నారు.


ఇవన్నీ పక్కన పెడితే, సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాలపై నెగిటివ్ కామెంట్లు చేసే వారు కూడా ఉన్నారు. నిజానికి ఈ రెండు సినిమాలు తెలుగు సినిమాలు కావు. కూలీ కోలీవుడ్ మూవీ. వార్ 2 బాలీవుడ్ మూవీ. రెండూ డబ్బింగ్ సినిమాలే. "మన తెలుగు సినిమాలు కాని ఈ మూవీస్ కోసం  ఇంత హడావిడి అవసరమా?" అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే.. భారీ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో రజనీకాంత్ నటించిన కూలీ.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల వార్ సినిమాలకి సంబంధించిన కటౌట్ లు పెట్టు.. పూలదండలు వేసి పాలాభిషేకాలు చేయాలి అనుకోవడం అవసరమా..? అనే రేంజ్‌లో చర్చ జరుగుతోంది. "సినిమా అంటే సినిమా గానే చూడండి, ఎందుకు ఇంత ఓవర్ హైప్ చేస్తున్నారు?" అని అంటున్నారు.

 

ఈ రెండు మన తెలుగు సినిమాలు కావు కదా — రాజమౌళి లేదా సుకుమార్ లాంటి తెలుగు డైరెక్టర్లు తీసిన సినిమాలకు ఇంత తాపత్రయపడితే బాగుంటుంది. కానీ, వేరే భాష ఇండస్ట్రీ వాళ్లు తీయించిన సినిమాలకు ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నారు అని కొందరు ఘాటుగా కౌంటర్లు వేస్తున్నారు. వార్ 2 సినిమాకి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఎన్టీఆర్–హృతిక్ రోషన్‌లను ఓ రేంజ్‌లో ప్రశంసిస్తూ హైప్ ఇస్తున్నారు.



కానీ లోకల్‌గా  టాక్ మాత్రం వేరే ఉంది. జనాల టాక్ ప్రకారం మాత్రం, తారక్-హృతిక్ వార్ 2 కన్నా రజనీకాంత్ కూలీ సినిమా హిట్ అవుతుందనే  నమ్మకం అందరికి ఉంది. చూడాలి మరి ఈ రెండు సినిమాల్లో ఏది హిట్ అవుతుందో..? ఒకవేళ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయితే, నెగిటివ్ కామెంట్ చేసే వాళ్లకే బిగ్ ప్లస్ అవుతుంది. అంతేకాదు. ఒకవేళ అందరి ఊహలు నిజమైయి రజనీకాంత్ నటించిన కూలీ సినిమా బిగ్ హిట్ అయి, తారక్ నటించిన వార్ 2 ఫ్లాప్ అయితే ఫ్యాన్స్ కి అది ఊహించని షాక్ అనే చెప్పలి.  అది కచ్చితంగా ఎన్టీఆర్ సినీ ఇమేజ్‌కి బిగ్ మైనస్ అవుతుంది. కానీ రెండు సినిమాలు హిట్ అయితే, అది మొత్తం కాన్సెప్ట్‌-బేస్డ్ హిట్‌గా మారుతుంది. అయితే కూలీ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంటుందని మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: