ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కాస్త చూసుకొని మాట్లాడాలి.. స్టార్డం రాగానే పొగరు తలకెక్కకూడదు. అయితే ఈ మాటలు ఇప్పుడు మాట్లాడుకోవడానికి ప్రధాన కారణం మృణాల్ ఠాకూర్ ఓ హీరోయిన్ పై చేసిన కామెంట్లే..ఈ హీరోయిన్ చేసిన కామెంట్ల పట్ల చాలామంది హీరోయిన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరి ఇంతకీ మృణాల్ ఠాకూర్ ఎవరిని కించపరుస్తూ మాట్లాడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. నార్త్, సౌత్ ఇండస్ట్రీలలో పేరు ఉన్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు.మొదట బాలీవుడ్లో రాణించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సీతారామం మూవీతో సౌత్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఈ సినిమాతో మృణాల్ కి మంచి గుర్తింపు లభించడమే కాకుండా వరుస సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. అలా హాయ్ నాన్న సినిమా కూడా హిట్ అయ్యింది.కానీ ఫ్యామిలీ స్టార్ దెబ్బ కొట్టినప్పటికీ అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. 

ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతిలో డెకాయిట్ సినిమా ఉంది.అలాగే శివ కార్తికేయన్ నెక్స్ట్ సినిమాలో మృణాల్ ని తీసుకునే ఆలోచన చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.అది కూడా ఇండస్ట్రీలో ఫేమస్ అయిన మరో స్టార్ హీరోయిన్ మీద. ఆమె ఎవరో కాదు బిపాసా బసూ.. ఒకప్పుడు ఐటెం సాంగ్ లకి కేరాఫ్ అడ్రస్ గా ఉండే బిపాసా బసూని మృణాల్ ఠాకూర్ చాలా దారుణంగా అవమానించింది. బిపాసా బసూ పై బాడీ షేమింగ్ కామెంట్లు చేసింది.. మీకు అబ్బాయిల్లాంటి కండలు తిరిగిన అమ్మాయి కావాలంటే మీరు బిపాసా బసూ దగ్గరికి వెళ్ళండి.ఎందుకంటే నేను ఆమె కంటే చాలా బాగుంటాను. అంటూ బిపాసా బసూ పై బాడీ షేమింగ్ కామెంట్లు చేసింది.

అయితే ఈ మాటలు విన్న చాలా మంది నెటిజన్స్ నువ్వు ఆమె కన్న ఏమైనా పెద్ద హీరోయిన్ వా..అసలు నీ మొహం అద్దంలో చూసుకున్నావా? ఎందుకు మరో హీరోయిన్ పై బాడీ షేమింగ్ కామెంట్లు చేస్తావ్.ఒక సినిమా హిట్ అవ్వడంతోనే ఏదో బాగా సాధించేసినట్టు మాట్లాడుతున్నావ్. ఆ హీరోయిన్ ముందు నువ్వు ఎంత.. ముందు నువ్వు వెళ్లి వెళ్లి అద్దంలో నీ మొహం చూసుకో..నువ్వు అంత పెద్ద అందగత్తవి అని పొగరా.. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్ ల కంటే నువ్వు జస్ట్ యావరేజ్ మాత్రమే.. అబ్బాయిలా ఆమె కాదు నువ్వే ఉంటావు అంటూ చాలా మంది నెటిజెన్లు మృణాల్ ఠాకూర్ ని ఏకిపారేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి పొగరు మాటలు మాట్లాడకూడదని,వేరొకరి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడకూడదంటూ మండిపడుతున్నారు. ఇక బిపాసా బసూ తెలుగులో మహేష్ బాబు తో టక్కరి దొంగ మూవీ చేసింది.కానీ బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. అలాగే ఐటెం సాంగ్స్ కూడా చేసి పేరు తెచ్చుకుంది. అలాంటి పెద్ద హీరోయిన్ ని మృణాల్ అవమానించడం అభిమానులకి అస్సలు నచ్చడం లేదు

మరింత సమాచారం తెలుసుకోండి: