
కానీ ఇప్పుడు ఆ క్రేజ్ అంతగా లేదు. తాజాగా మురుగదాస్ తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్‌పై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. "మా తమిళ దర్శకులే గొప్పవారు," అన్నట్టుగా ఆయన ప్రసంగించారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఆయన మాట్లాడుతూ "చాలా మంది దర్శకులు వెయ్యి కోట్ల క్లబ్ అంటూ పాకులాడతారు. ఆ క్లబ్‌లో చేరేందుకు మాత్రమే ఆసక్తి చూపుతారు. వాళ్లు కేవలం జనాలను ఎంటర్‌టైన్ చేసేందుకే సినిమాలు తీస్తారు. కానీ మా తమిళ దర్శకులు మాత్రం ప్రజలకు ఉపయోగపడే సినిమాలనే తీస్తారు. మేము 100 కోట్లు, 1000 కోట్లు గురించి ఆలోచించం. సామాజిక కోణంలో ఆలోచించి సినిమాలు చేస్తాం. ప్రజలకు జ్ఞానం పెంచేలా, ప్రభావితం చేసేలా తీస్తాం," అంటూ కామెంట్ చేశారు.
ఇలా చెప్పడంతో ఒక్కసారిగా మురుగదాస్‌పై సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోయింది. "తెలుగు డైరెక్టర్లు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే సినిమాలు తీస్తారా? ప్రజలను ఉద్దేశించి, జ్ఞానం పెంచేలా సినిమాలు చేయరా?" అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. దీనిపై టాలీవుడ్ ప్రముఖులూ ఫైర్ అవుతున్నారు. చూస్తుంటే మురుగదాస్‌కి ఇకపై టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఎవరూ కూడా ఛాన్స్ ఇవ్వరని స్పష్టమవుతోంది. దీనిపై టాలీవుడ్ హీరోలు సీరియస్‌గా స్పందించాలి అంటూ ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు.