టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన సీనియర్ నటులలో రాజశేఖర్ ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత కాలంలో ఈయన ఆ స్థాయి  విజయాలను అందుకోవడంలో చాలా వరకు  వెనుకబడ్డాడు. దానితో ఈయన క్రేజ్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఆఖరుగా రాజశేఖర్ కు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన గరుడా వేగ సినిమాతో మంచి విజయం దక్కింది.

మూవీ తర్వాత కూడా పలు సినిమాలలో రాజశేఖర్ నటించిన ఆ సినిమాల ద్వారా ఈయనకు సరైన విజయం దక్కలేదు. ఇకపోతే రాజశేఖర్ రిజెక్ట్ చేసిన ఓ మూవీ లో బాలకృష్ణ హీరో గా నటించగా అది అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ హీరోగా లక్ష్మీ నరసింహ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మొదట జయంత్ , బాలకృష్ణ తో కాకుండా రాజశేఖర్ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనను సంప్రదించగా ఆయన మాత్రం ఆ సమయంలో వేరే సినిమాలు తో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా చేయలేను అని చెప్పాడట.

దానితో బాలకృష్ణ ను జయంతి సంప్రదించగా ఆయన ఈ సినిమాలో హీరోగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇకపోతే లక్ష్మీ నరసింహ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ లో ఆసిన్ , బాలకృష్ణ కు జోడిగా నటించింది. ఈ మూవీలోని వీరిద్దరి జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ఆ సమయంలో మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: