అదే కాక, ఫహద్ ఫాజిల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి గానీ, సినిమాలో సంబంధిత కార్యక్రమాలకు గానీ హాజరుకాకపోవడంతో ఆయనకు ఈ సినిమా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయిందని కూడా జనాలు మాట్లాడుకున్నారు. సినిమా రిలీజ్ అయ్యక అదే నిజం అయ్యింది. ఇప్పుడు తాజాగా ఆయన చేసిన పని మళ్లీ చర్చకు దారితీసింది. అల్లు అర్జున్ అంటే ఆయనకి ఇష్టం లేదేమో అన్నట్టుగా కనిపించేలా చేసింది. మనందరికీ తెలిసిందే, ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వేగంగా పూర్తవుతోంది. అయితే ఈ సినిమాలోని క్రేజీ పాత్ర కోసం ఫహద్ ఫాజిల్‌కి ఆఫర్ ఇవ్వగా, ఆయన వెంటనే “నో” చెప్పేసారట. అసలు కాన్సెప్ట్ ఏంటి, పాత్ర ఏంటి అని వినకుండానే “అల్లు అర్జున్ సినిమా” అని తెలిసి రిజెక్ట్ చేశారట.
దీంతో పుష్ప 2 సినిమా రోజులు గుర్తొచ్చిన్నట్లున్నాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. అందుకే రిజెక్ట్ చేశారంటూ కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం “తన టాలెంట్‌పై నమ్మకం, తనకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ వల్లే ఆయన అలా చేశాడు. ఇందులో తప్పేముంది?” అని అంటున్నారు. ఫహద్ కి మలయాళంలో చాలా ఫ్యాన్ బేస్ ఉంది. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలో అయినా నటిస్తాడు అన్న పేరు ఉంది. అలాంటి నటుడికి కోపం తెప్పిస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది అంటున్నారు జనాలు. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి