ఈ సినిమా టాక్ మిక్స్‌డ్‌గా వచ్చినా, ప్రభాస్ పెర్ఫార్మెన్స్‌కి వేరే లెవెల్ మార్కులు పడ్డాయి. చార్మీ, త్రిష హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా మరొకసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ మధ్యకాలంలో పాత సినిమాలు రీ-రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన పౌర్ణమి కూడా రీ-రిలీజ్‌కి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 19వ తేదీన ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాంటి సమయంలోనే ప్రభాస్‌కి సంబంధించిన ఒక పాత గాసిప్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
గతంలో త్రిష–ప్రభాస్ మధ్య ఏదో సంబంధం ఉందని, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని, మధ్యలో మరొక తెలుగు హీరో రావడంతో వాళ్ళిద్దరూ విడిపోయారని, ఆ తర్వాతే ప్రభాస్ - అనుష్కతో దగ్గరయ్యాడని రకరకాల రూమర్స్ వినిపించాయి. దీనిపై ప్రభాస్ ఎప్పటికప్పుడు “ఇందులో ఏమీలేదు” అంటూ క్లారిటీ ఇచ్చినా కూడా ఆ వార్తలు మాత్రం ఆగలేదు. మరొకసారి సోషల్ మీడియాలో త్రిష–ప్రభాస్ మధ్య ఉన్న ఈ గాసిప్స్ అభిమానులకు ఇబ్బందికరంగా మారాయి. అయితే రెబల్ ఫ్యాన్స్ మాత్రం ఆ ట్రోలింగ్, రూమర్స్‌కి సమర్థవంతంగా కౌంటర్స్ ఇస్తున్నారు. “ప్రభాస్ నిజాయితీ, నీతి ఏమిటో అందరికీ తెలుసు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పౌర్ణమి సినిమా రీ-రిలీజ్ ప్రభాస్‌ను ఊహించని చిక్కుల్లోకి నెట్టేసిందని కొంతమంది ఘాటుగానే కౌంటర్స్ వేస్తూ మాట్లాడుకుంటున్నారు..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి