
తాజాగా విడుదలైన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “వార్ 2” పై రిలీజ్‌కు ముందు సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. అద్భుతమైన విజువల్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, స్టార్ హీరోల జోడీ, అలాగే దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంతో సినిమాపై ఊహించని రేంజ్ బజ్ క్రియేట్ అయింది. సినిమా విడుదల తర్వాత వచ్చిన టాక్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
తెలుగు వెర్షన్ విషయానికి వస్తే, మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం డీసెంట్‌గా వచ్చాయి. కానీ వారం రోజులు గడిచేలోపు కలెక్షన్లు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకులకు కథనం పెద్దగా ఆకట్టుకోలేదన్నది ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. మొదటి భాగం "వార్"లో కనిపించిన ఫ్రెష్ యాక్షన్, కొత్తదనాన్ని ఈ సీక్వెల్ ఇవ్వలేదనే ఫీల్ ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో టాక్ మిక్స్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఆకర్షించడంలో సినిమా వెనుకబడి పోయింది. బుధవారం నాటికే బుకింగ్స్ మరీ డల్ అయిపోయాయి. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు, హై బడ్జెట్ టెక్నికల్ వర్క్ ఉన్నప్పటికీ, కూలీ సినిమా కంటే కూడా తక్కువ బుకింగ్స్ నమోదయ్యాయి. దీంతో వార్ 2 ఫైనల్ రన్ దాదాపు ముగిసిపోయినట్టే అని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు