టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలు అభిమానులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. పలు రకాల వెకేషన్స్ కి వెళ్ళినా కూడా అక్కడ ఫోటోలను పంచుకుంటూ ఉంటారు. ఈ ఏడాది తండేల్ సినిమాతో నాగచైతన్య మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య NC -24 అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి


నాగచైతన్య పర్సనల్ లైఫ్ విజయానికి వస్తే గత ఏడాది అన్నపూర్ణ స్టూడియోలో శోభిత తో వివాహాన్ని చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. అప్పటినుంచి శోభిత నెమ్మదిగా సినిమాలకు దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంది శోభిత. కానీ తాజాగా ఈ జంట తిరుమలకు వెళ్లి అక్కడ స్వామివారిని దర్శించుకున్నట్లుగా కొన్ని ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడ ప్రత్యేకమైన పూజలు చేయించినట్లుగా  కనిపించడంతో అభిమానులు ఈ వీడియోలను తెగ వైరల్ గా చేస్తున్నారు.


ముఖ్యంగా నాగచైతన్య పట్టు పంచలో కనిపిస్తూ ఉండగా శోభిత ఎరుపు రంగు చీరలో నుదుటిన బొట్టుతో అచ్చ తెలుగు అమ్మాయిల ఆకట్టుకున్నది. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించి ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్ చూసి ఏదైనా గుడ్ న్యూస్ త్వరలోనే చెప్పబోతున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు. గత కొంతకాలంగా శోభిత కూడా తల్లి కాబోతోందనే విధంగా వార్తలైతే వినిపించాయి.. ఈ వార్తలను ఖండించలేదు అక్కినేని కుటుంబం. మరి ఈ వీడియో పైన ఈ జంట క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి. నాగచైతన్య కూడా ఎన్నో సందర్భాలలో పిల్లల గురించి మాట్లాడడం జరిగింది. శోభిత గతంలో నిరంతరం గ్లామర్ హీరోయిన్ గా కనిపించినప్పటికీ వివాహమా అనంతరం శోభిత ఒక్కసారిగా తన లైఫ్ ని మార్చేసుకున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: