అత్యంత తక్కువ సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న వారిలో అనుష్క శెట్టి ఒకరు. ఈమె టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఇందులో అనుష్క తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో అత్యంత తక్కువ కాలంలోనే అనుష్క స్టార్ హీరోయిన్ స్థాయికి చేరిపోయింది.

ఇకపోతే తాజాగా అనుష్క , క్రిష్ జగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఘాటి అనే సినిమాలో నటించింది. ఈ మూవీ.ని సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను మాత్రం నార్త్ అమెరికాలో సెప్టెంబర్ 4 వ తేదీనే విడుదల చేయనున్నారు. ఈ మూవీ యొక్క నార్త్ ఇండియా హక్కులను ఓ ప్రముఖ సంస్థ దక్కించుకుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క నార్త్ ఇండియా హక్కులను శ్లోక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ దక్కించుకుంది. 

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ సంస్థ వారు ఈ సినిమాను నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటి నుండే సన్నాహాలను మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ మూవీ తో అనుష్క కు ఏ స్థాయి విజయం దక్కుతుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: