కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో లోకేష్ కనగరాజు ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరియర్లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయనకు అద్భుతమైన విజయాన్ని , అద్భుతమైన గుర్తింపును తీసుకు వచ్చిన సినిమాలలో ఖైదీ మూవీ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ సినిమాలో కార్తీ హీరో గా నటించాడు. ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాను తెలుగు లో విడుదల చేయగా ఈ మూవీ తెలుగు బాక్సా ఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఖైదీ సినిమా చివరన ఖైదీ మూవీ కి పార్ట్ 2 ఉండబోతుంది అని మేకర్స్ ప్రకటించారు.

దానితో ఖైదీ మూవీ అద్భుతంగా ఉండడం , దాని ఎండింగ్ కూడా సూపర్ గా ఉండడంతో ఎప్పుడు ఖైదీ 2 మూవీ వస్తుందా అని ఎంతో మంది ప్రేక్షకులు , అలాగే కార్తీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఖైదీ మూవీ వచ్చి చాలా చాలామే అవుతున్న లోకేష్ కనగరాజ్ ఆ తర్వాత చాలా సినిమాలకే దర్శకత్వం వహించిన ఖైదీ 2 మూవీ ని మాత్రం ప్రారంభించడం లేదు. ఇక తాజాగా లోకేష్ , రజనీ కాంత్ హీరో గా కూలీ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా తాజాగా విడుదల అయింది. ఈ మూవీ తర్వాత ఖైదీ 2 ఉండబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ ఖైదీ 2 మూవీ కంటే ముందు లోకేష్ ,  రజినీ , కమల్ హీరోలుగా ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే కూలీ మూవీ కి లోకేష్ కనగరాజ్ ఏకంగా 50 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు , ఖైదీ 2 మూవీకి 75 కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తున్నట్లు , దానితో ఈ మూవీ నిర్మాతలు వెనక్కు వెళుతున్నట్లు అందుకే ఖైదీ 2 మూవీ స్టార్ట్ కావడం లేదు అని ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

lk