కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం “కూలీ” బాక్సాఫీస్ వద్ద సంచలనంగా నిలుస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా విడుదల రోజునే డివైడ్ టాక్ వచ్చినా, కలెక్షన్ల పరంగా మాత్రం ఎలాంటి ప్రభావం పడలేదు. మొదటి వారం నుంచే అద్భుత వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రు. 400 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని దుమ్ము రేపింది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించిన “ కూలీ ” ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలోనూ కొత్త రికార్డుల క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొట్టింది. అక్కడ “కూలీ” 6.719 మిలియన్ డాలర్లు ( దాదాపు రు. 58 కోట్లు గ్రాస్ ) సాధించి, ఇప్పటివరకు వచ్చిన అన్ని తమిళ సినిమాల్లోనూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ ఫీట్ రజినీకాంత్ గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న క్రేజ్‌కి నిదర్శనంగా నిలిచింది.


రజినీకాంత్ కెరీర్‌లో ఇది మరో మైలు రాయి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ సాహిర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించడం సినిమాకి అదనపు హైలైట్‌గా మారింది. యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్ అందించిన సంగీతం ఇప్పటికే మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా, కేవలం దేశీయ మార్కెట్‌లోనే కాదు, విదేశీ మార్కెట్లలోనూ బలమైన స్థానం సంపాదించుకుంది. ఇకపై “కూలీ” ఏ రేంజ్ కలెక్షన్ల దాకా వెళ్తుందో, మరో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అన్న ఆసక్తి పెరుగుతోంది. మొత్తంగా, రజినీకాంత్ - లోకేష్ కాంబోపై ఉన్న భారీ అంచనాలను “కూలీ” వసూళ్ల పరంగా నిలబెట్టిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: