ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల టేస్ట్ చాలా వరకు మారింది. కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరో నటించిన సినిమాలు ఎలా ఉన్నా సరే భారీ కలక్షన్లను వసూలు చేసి పెద్ద ఎత్తున లాభాలను నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్లకు తెచ్చిపెట్టేవి. కానీ ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే ఆ సినిమాలో చిన్న హీరో ఉన్నాడా ..? పెద్ద హీరో ఉన్నాడా ..? అనేది ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం కంటెంట్ బాగుండి , ప్రేక్షకులను అలరించే అంశాలు ఆ సినిమాలో ఉంటే చాలు ఆ సినిమాను ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. దానితో చిన్న , పెద్ద అనే తేడా లేకుండా బాగున్న  సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి.

కొంత కాలం క్రితం కన్నడ సినిమా పరిశ్రమ నుండి సూ ఫ్రమ్ సో అనే చిన్న సినిమా థియేటర్లలో విడుదల అయింది. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కన్నడ బాక్సా ఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను వసూలు చేసి సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ సినిమాను సూ ఫ్రమ్ సో అనే టైటిల్ తోనే తెలుగులో కూడా విడుదల చేశారు. ఇక తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేయడంలో కాస్త విఫలం అయింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా రాబటినట్లు తెలుస్తోంది. ఇలా చిన్న సినిమాగా వచ్చి 100 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను జియో హాట్ స్టార్ సంస్థ దక్కించుకున్నట్లు , అందులో భాగంగా సెప్టెంబర్  5 వ తేదీ నుండి ఈ మూవీ ని జియో హాట్ స్టార్ సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: