జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ హీరోలుగా కియార అద్వానీ హీరోయిన్గా వార్ 2 అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన 13 రోజుల బాక్సా ఫీస్ రన్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తే హిట్ స్టేటస్ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

13 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 13.76 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 7.94 కోట్లు , ఉత్తరాంధ్రలో 5.98 కోట్లు , ఈస్ట్ లో 3.33 కోట్లు , వేస్ట్ లో 2.06 కోట్లు ,  గుంటూరులో 4.24 కోట్లు , కృష్ణ లో 3.29 కోట్లు , నెల్లూరు లో 1.86 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13 రోజుల్లో ఈ సినిమాకు 42.46 కోట్ల షేర్ ...  62.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 13 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటకలో 8.30 కోట్ల కలెక్షన్లు దక్కగా , తమిళ్ , కేరళలో కలుపుకొని 3.15 కోట్లు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 83.45 కోట్లు , ఓవర్సీస్ లో 35.15 కోట్లు కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 172.51 కోట్ల షేర్ ... 334.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 305 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 307 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 134.49 కోట్ల షేర్ కలెక్షన్లను రాబడితే వరల్డ్ వైడ్గా హిట్ స్టేటస్ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: