
బాలీవుడ్‌లోనే కాదు, తెలుగులోనూ ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. అయితే ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే .. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్‌కు ఈ సినిమా ఫలితం అసలు సంబంధం లేకపోవడం. కావాలనే కొందరు కుట్ర చేసి, సినిమాని అడ్డుకుని, ఫ్లాప్ అయ్యేలా చేసారని కూడా ఓ టాక్ వినిపిస్తోంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే..ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. అదేంటంటే, ‘వార్ 2’ సినిమా ఫ్లాప్ కావడం జూనియర్ ఎన్టీఆర్‌కి అనుకోని అదృష్టం కలిగించిందని జనాలు అంటున్నారు. ఎందుకంటే, ఈ సినిమా రిలీజ్ కాకముందే బాలీవుడ్‌లో మరో సోలో ప్రాజెక్ట్ గురించి ఎన్టీఆర్‌తో డిస్కషన్లు జరిగినట్టు తెలుస్తోంది. ఆ మేకర్స్‌తో దాదాపు అన్ని చర్చలు పూర్తయ్యి, ఫైనల్ డెసిషన్‌కి వచ్చేశారట. కానీ ఇంతలోనే ‘వార్ 2’ రిలీజ్ అయి ఘోర పరాజయం చవిచూసింది.
దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారట. "ఇప్పుడే బాలీవుడ్ సోలో సినిమా వద్దు" అంటూ ఆ ప్రాజెక్ట్‌ని హోల్డ్‌లో పెట్టారని సమాచారం. మేకర్స్ కూడా ఆ ప్రాజెక్ట్ కోసం ఎక్కువ సమయం వెయిట్ చేయలేక, ఆ పాత్రను రణబీర్ కపూర్‌కి ఆఫర్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే .. ఆ సినిమా కథ, జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్‌కి, ఆయన ఫ్యాన్ బేస్‌కి ఏ మాత్రం సరిపోని విధంగా ఉందట. అలా అయితే ఆ సినిమా రిజల్ట్ ‘వార్ 2’ కంటే కూడా ఇంకా నెగిటివ్‌గా మారేదట. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా నుండి వెనక్కి తగ్గడం చాలా మంచి నిర్ణయమని అభిమానులు భావిస్తున్నారు.
ఇక మేకర్స్ చివరికి ఆ సినిమాలో రణబీర్ కపూర్‌ను ఇన్వాల్వ్ చేయడం కూడా కచ్చితంగా దేవుడు చేసిన మాయే అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అంటే, జూనియర్ ఎన్టీఆర్‌కి ఆ సినిమాను మిస్ చేయించడం ద్వారానే దేవుడు ఆయనకు పెద్ద సమస్యను తప్పించాడని అభిమానులు నమ్ముతున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి చేస్తున్న కొత్త సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ సినిమా షూటింగ్ హై స్పీడ్‌లో జరుగుతోంది. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ‘వార్ 2’ ఫ్లాప్ అయినా, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం పడలేదు. అసలు ఇంత పెద్ద నెగిటివ్‌ని కూడా పాజిటివ్‌గా మార్చేసుకోవడం జూనియర్ ఎన్టీఆర్ కే సాధ్యమని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..!