
పవర్‌స్టార్ అంటేనే తెలుగు సినీ లవర్స్‌కు రెండున్నర దశాబ్దాల క్రిందటే ఓ తెలియని పవర్ వచ్చేది. పవన్ అంటే ఓ మానియా.. అతడి స్టైల్‌కు ఎంతోమంది యువత అప్పట్లో ఫిదా అయిపోయేవారు. పవన్ గురించి ఎంత రాసినా అతడి ఆలోచనలో ఎవ్వరికి అందడు. బుర్ర బద్దలు కొట్టుకుని, ఒక నాలుగైదు టీలు వెంట వెంటనే తాగి, నరాలు బిగబట్టి, రక్తాలు చిందించి అతని గురించి రాసినా, పవన్ కళ్యాణ్ కు డెఫినిషన్ ఇవ్వలేం... ! పవన్‌లో ఏదో తెలియని ఛరిష్మా ఉంది.. ఏదో తెలియని మ్యాజిక్.. ఆకర్షణ ఉన్నాయి. ఏదో ఉంది, అదేంటో తెలియదు, ప్రకృతికే అంతుపట్టని రహస్యం, ఇంకా ఎంతో ఉంది అది పవరా పొగరా ఊహించలేం. వీరుడు శూరుడు అని ఆ రాసిన లైన్లన్నీ కొట్టేయడం తప్ప అతని ఆలోచనను అంచనా వేయలేం, అతని గుణాన్ని విశ్లేషించలేం.
పదేళ్ళు వరుసగా ఫెయిల్యూర్స్ ఇచ్చాడు అతనే సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు, అతనేం చేయగలడు అనుకునేలోపే సరదాగా ఇండస్ట్రీ హిట్ కొట్టి చూపిస్తాడు. అత్తారింటికి దారేది ముందు పవన్ పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. గబ్బర్‌సింగ్.. ఆ వెంటనే అత్తారింటికి దారేది రూపంలో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. 2019లో రెండు చోట్ల జనసేన అధ్యక్షుడి హోదాలో పోటీ చేసి... ఒక్కచోట కూడా గెలవనోడు అని హేళన చేసి అతన్ని గెలుక్కునే లోపే నేరుగా డిప్యూటీ సీఎం హోదాలో కూర్చుంటాడు. ఇలా పవన్ ఎవ్వరి ఆలోచనలకు.. అంచనాలకు అందడు.
అతను ఒక ఆలోచన, ఓ సంఘర్షణ, ఒక విస్ఫోటనం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే గాంధీ అని ఒప్పుకున్నారంటే పవన్ పవర్ స్టామినా అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇండియా హెరాల్డ్. కామ్ తరపున పవన్ కళ్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.