
అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా సూపర్ సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్.. నిర్మాతగా మాత్రం ఫెయిల్ అయ్యారు. రెండున్నర దశాబ్దాల సినీ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ మొత్తం రెండు చిత్రాలను నిర్మించారు. కానీ అవి రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. వాటిలో ఒకటి `సర్దార్ గబ్బర్ సింగ్` ఒకటి కాగా.. మరొకటి `చల్ మోహన రంగా`.
కె.ఎస్.రవీంద్ర డైరెక్ట్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. ఈ మూవీలో మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేసిన పవన్.. కథ, స్క్రీన్ ప్లే కూడా అందించారు. అదివిధంగా నిర్మాతగానూ వ్యవహరించారు. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ కి ఇది సీక్వెల్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అయితే 2016లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాత కావడంతో పవన్ కళ్యాణ్ మొదట ఈ మూవీకి ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. బిజినెస్ ద్వారా వచ్చిన లాభాల్లో వాటా తీసుకున్నారు. ఆ రకంగా పవన్ కి రూ.30 కోట్ల వరకు వచ్చింది. కానీ రిలీజ్ అనంతరం మూవీ డిజాస్టర్ కావడం, బయ్యర్స్ కి నష్టాలు రావడంతో, రూ.15 కోట్ల వరకు పవన్ వెనక్కి ఇచ్చేశాడు.
ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లో నిర్మాతగా చేసిన మరొక సినిమా `చల్ మోహన రంగా`. నితిన్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. శ్రేష్ఠ్ మూవీస్, పి. కె. క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా నిర్మించిన చల్ మోహన రంగా 2018లో విడుదలై ఫ్లాప్ అయింది. అలా ప్రొడ్యూసర్ గా రెండు సార్లు పవన్ చేతులు కాల్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ మరే సినిమాను ప్రొడ్యూస్ చేయలేదు.