
మీనాక్షి చౌదరి గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’లో నటించింది. ఆ సినిమాలో ఆమెకు త్రివిక్రమ్ వర్క్‌స్టైల్ బాగా నచ్చడంతో మళ్లీ ఈ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. త్రివిక్రమ్ కూడా ఇప్పటికే పరిచయం ఉన్న నటిని మళ్లీ తీసుకోవడంలో ఇష్టపడతాడని టాలీవుడ్ లోకల్ టాక్. ఇక శ్రద్ధా శ్రీనాథ్ పేరు కూడా చర్చలో ఉంది. వెంకటేష్‌తో ఇటీవల వచ్చిన ‘సైంధవ్’లో ఆమె నటించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా, శ్రద్ధా - వెంకటేష్ జోడీకి మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఈ కారణంగా త్రివిక్రమ్ కూడా ఆమెను ఈ ప్రాజెక్ట్ కోసం పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఇవన్నీ కాకుండా నేహా శెట్టి పేరు కూడా వినిపిస్తోంది. ‘డీజే టిల్లు’ వంటి సినిమాలతో యువతలో పాపులర్ అయిన ఆమె, ప్రస్తుతం టాలెంటెడ్ నటి అని నిరూపించుకుంటోంది. కాబట్టి త్రివిక్రమ్ తన సినిమాకు యంగ్, ఎనర్జిటిక్ హీరోయిన్ కావాలనుకుంటే నేహా శెట్టిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద రుక్మిణి వసంత్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నేహా శెట్టి అనే నలుగురు పేర్లు ఈ ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతున్నాయి. వీరిలో ఎవరిని ఫైనల్ చేస్తాడన్నది త్రివిక్రమ్ స్టైల్‌లో చివరి నిమిషం వరకూ సస్పెన్స్‌గా ఉంటుంది.