శీలావతిగా ఆమె చేసిన పోరాట సన్నివేశాలు ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచాయి. ఈసారి దర్శకుడు క్రిష్ ఊహించని యాక్షన్ ఎలిమెంట్స్‌తో అనుష్కతో ఊచకోత చేయించినట్టుగా ఉంది. అనుష్క ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ముందే రానని చెప్పినప్పటికీ.. సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే రానాతో ఫోన్ కాల్‌లో మాట్లాడిన స్వీటికి ఇప్పుడు ప్రభాస్ రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేయడం సినిమాకు మంచి బజ్ జనరేట్ అయ్యేలా చేసింది. దీంతో.. ఘాటి రాక కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం థియేటర్లోకి రానుండగా.. ఇంకొన్ని గంటల్లో తెరపై శీలావతి ఊచకోతను చూడబోతున్నాం. ఈ సినిమాలో అనుష్క పాత్ర అరుంధతికి మించి ఉంటుందనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో వేదం అనే సినిమాలో నటించారు అనుష్క. ఆ సినిమాలో సరోజ పాత్ర లాగే, ఇప్పుడు 'ఘాటి'లో షీలావతి పాత్ర ప్రత్యేకంగా ఎప్పటికి ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుందనే అంచనాలున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి