ఇంతకుముందు తెలుగులో వరుస హిట్స్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్, భారీ బడ్జెట్, స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేసేవాడు. కానీ మధ్యలో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ వల్ల కొన్నేళ్ల పాటు టాలీవుడ్ నుంచి దూరమయ్యాడు. ఆ సినిమా తనకు చేదు అనుభవం మాత్రమే మిగిల్చింది. తిరిగి టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నంలో మొదలు పెట్టిన సినిమా ‘టైసన్ నాయుడు’. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. షూటింగ్ పూర్తయ్యినట్లు వార్తలు వచ్చాయి, కానీ రిలీజ్ సమయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఏడాది నూంచి ఈ సినిమా వార్తల్లో కూడా కనిపించలేదు. దీని తర్వాత శ్రీనివాస్ చేసిన ‘భైరవం’ విజయం సాధించింది.


ఇక  ఇప్పుడు ‘కిష్కింధపురి’ కూడా రిలీజ్‌కు రెడీ అయ్యింది. మళ్లీ మరో కొత్త సినిమా కూడా లైన్‌లో ఉంది. కానీ ‘టైసన్ నాయుడు’ యథార్థ స్థితి ఏమిటో ఎవరూ చెప్పలేరు. ఇప్పటివరకు న్యూస్ రాకపోవడం ఫ్యాన్స్ ని నిరాశ పరిచింది. అయితే ఈ నెల 12న ‘కిష్కింధపురి’ రిలీజ్ కు సిద్ధమవుతున్న సందర్భంలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్, ‘టైసన్ నాయుడు’ పూర్తి అయ్యిందని, కానీ రకరకాల కారణాల వల్ల ఆలస్యం జరిగిందని ప్రకటించాడు. ఈ చిత్రం ఈ డిసెంబర్ లో రిలీజ్ కానుందని ఫ్యాన్స్ కి స్పష్టత ఇచ్చాడు. సాగర్ చంద్ర దర్శకుడు ఈ సినిమా కోసం దర్శకశైలిని పూర్తిగా మార్చి శ్రీనివాస్ స్టైల్ మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించారు. దర్శకుడు భీమ్లా నాయక్ వంటి ఫిల్మ్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 

నిర్మాతలు 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట. సినిమాకు మొదటే బజ్ బాగానే ఏర్పడింది, కానీ ఆలస్యంతో ఫ్యాన్స్ కొంతమంది సినిమాని మరచిపోయారు. కథానాయికగా నభా నటేష్, శ్రీనివాస్‌తో ‘అల్లుడు అదుర్స్’ వంటి ప్లాప్ సినిమాలో క‌లిసి నటించింది.టైసన్ నాయుడు మొత్తం ప‌క్క‌ మాస్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంది. ఇప్పుడు ‘టైసన్ నాయుడు’ డిసెంబర్‌లో థియేటర్లలో రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు ఆలస్యం అయినప్పటికీ, ఈ సినిమా తిరిగి ఫ్యాన్స్ ను థియేటర్లకు తెచ్చి, బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ హీరోగా తన స్థానాన్ని మరింత బలంగా చూపించనుంది.అని గ‌ట్టి నమ్మకంగా ఉన్న‌రు.

మరింత సమాచారం తెలుసుకోండి: