
ఇప్పుడు చిరంజీవి - అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ భారీ సినిమా సెట్స్ పై ఉంది. కంటెంట్, టైమింగ్, కామెడీ టైమింగ్‌ల విషయంలో అనిల్ రావిపూడి ప్రత్యేకత అందరికీ తెలిసిందే. అందువల్ల ఈ కాంబినేషన్‌పై అభిమానులు, సినిమా వర్గాలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నాయి. అయితే, ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే ముందు చిరంజీవి "విశ్వంభర" అనే పీరియాడికల్ ఫ్యాంటసీ డ్రామాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సినిమా చాలా కాలంగా వీ ఎఫ్ ఎక్స్ పనుల్లో బిజీగా ఉంది. అసలే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ, భారీ స్థాయిలో తీసిన విజువల్ ఎఫెక్ట్స్ (వ్FX) పనులు ఎక్కువ సమయం పట్టడంతో విడుదల వాయిదా పడింది.
"విశ్వంభర" సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే వశిష్ఠకు ఒక పెద్ద అవకాశం ఇవ్వాలని చిరంజీవి నిర్ణయించుకున్నారట. అంతేకాకుండా, "విశ్వంభర" మంచి విజయాన్ని సాధిస్తే, తన కుమారుడు రామ్ చరణ్‌తో వశిష్ఠ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చిరంజీవి వాగ్దానం చేశారని ఫిలిం నగర్ టాక్. చరణ్‌తో సినిమా చేయడానికి వశిష్ఠ కి ప్రామిస్ చేయడం మంచి నిర్ణయం అన్న అభిప్రాయం కొందరిది. కానీ ఈ నిర్ణయాన్ని సినిమా ఫలితంపై ఆధారపెట్టడం ఎంతవరకు సబబు అని సోషల్ మీడియాలో కొందరు విమర్శిస్తున్నారు. "ఇదేదో మార్కెటింగ్ ఆఫర్ లాంటిదే, సినిమా హిట్ అయితే మరో సినిమా చాన్స్!" అంటూ చిరంజీవిపై ట్రోల్స్ తో విరుచుకుపడుతున్నారు.
ఈ సినిమాలో మెగాస్టార్‌తో కలిసి త్రిష కీలక పాత్రలో నటిస్తోంది. చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ గురించి మేకర్స్ ఇప్పటికే ఘనంగా ప్రకటించారు. మెగా అభిమానుల కోసం ప్రత్యేకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నామని చిత్రబృందం చెబుతోంది. "విశ్వంభర" సినిమాతో మెగాస్టార్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపిస్తారా? ఈ సినిమా విజయవంతమై వశిష్ఠకు చరణ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా? అన్న ప్రశ్నలతో అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ, సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.