
కూతురు రాహా కోసం ప్రత్యేకంగా సినిమాలు చేయాలని ఆలియా భట్ భావిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి ఆలియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకు తాను నటించిన ఏ సినిమా కూడా తన కూతురు రాహా చూసే స్థాయిలో లేదని పేర్కొంది.
`స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నుంచి గల్లీ బాయ్, గంగూబాయి కాఠియావాడి, రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ వరకు నేను చేసిన సినిమాలు చిన్న పిల్లలు చూసేంత వయసుకు సరిపోవు. రాహా కోసం ప్రత్యేకంగా కొత్త తరహా సినిమాలు చేయాలని ఉంది. ఆమె నవ్వుకునే, ఎంజాయ్ చేసే మూవీస్‌లో నటించాలని అనుకుంటున్నాను` అని వెల్లడించింది.
అదే సమయంలో, తన భర్త రణబీర్ కపూర్ నటించిన బర్ఫీ సినిమాను ప్రస్తావిస్తూ.. `ఆ చిత్రం సరదాగా, సున్నితంగా ఉంటుంది. రాహా దాన్ని చూడగలిగేలా ఉంది. అలాంటి సినిమాలు చేయడమే ఇప్పుడు నా కోరిక` అని చెప్పింది. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్న ఆలియా భట్, ఒక తల్లిగా తన కూతురు కోసం ప్రత్యేకమైన సినిమాలు చేయాలనుకోవడం నిజంగా అభినందనీయమే. అయితే ఈ నిర్ణయంతో ఆలియాను ఇకపై ఇంటెన్స్ డ్రామాలు, బోల్డ్ క్యారెక్టర్స్ లో చూడటం కష్టమనే చెప్పుకోవచ్చు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు