కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ఓ టీ టీ లో సినిమాలను ప్రేక్షకులు పెద్దగా చూసేవారు కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పెరిగిన టికెట్ ధరల కారణంగా , అలాగే కొన్ని మల్టీప్లెక్స్ లలో ఫుడ్ ఐటమ్స్ కి భారీ ధరలు ఉండడంతో ఫ్యామిలీస్ తో కలిసి కొంత మంది సినిమాలకు వెళ్లకుండా ఓ టీ టీ లోనే సినిమాలను చూడడానికి కొంత మంది ప్రముఖ ప్రాధాన్యతను ఇవ్వడంతో ఓ టీ టీ ల క్రేజ్ భారీగా పెరిగింది. ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లు కూడా పెద్ద మొత్తంలో సినిమాలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు అని , దానితో కొన్ని చిన్న , మీడియం రేంజ్ సినిమాలు ఓ టీ టీ హక్కులు అమ్ముడు కూడా పోవడం లేదు అనే టాక్ పెద్ద ఎత్తున నడుస్తుంది.

కానీ ఇలాంటి సమయంలో భారీ క్రేజ్ ఉన్న సినిమాలకు మాత్రం ఓ టీ టీ హక్కుల ద్వారానే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయి. భారీ క్రేజ్ కలిగిన ఓ రెండు సినిమాలకు ఓ టీ టీ డీల్ ద్వారానే పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినట్లు , దానితోనే సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్  సంస్థ ఏకంగా 80 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీ లో కాంతారా చాప్టర్ 1 అనే సినిమా రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఏకంగా 125 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఈ రెండు సినిమాలు కూడా ఓ టీ టీ డీల్ ద్వారానే అద్భుతమైన సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలకు గనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ సినిమాలు అద్భుతమైన లాభాలను అందుకునే అవకాశాలు ఉన్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: