జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్స్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. మరి కొంతమంది ఇతర కామెడీ షోలలో చేస్తూ బాగానే పాపులారిటీ సంపాదించారు. అలాంటి వారిలో జబర్దస్త్ కమెడియన్ మహిధర్ కూడా ఒకరు. ముందు జబర్దస్త్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత టీమ్ లీడర్ గా కూడా ఎదిగారు. కానీ కొన్ని కారణాల చేత జబర్దస్త్ మానేసి ప్రస్తుతం యూట్యూబ్లో రివ్యూలు, ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు. తాజాగా మహీధర్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ లో జరిగే విషయాలను బయటపెట్టారు.

మహిధర్ మాట్లాడుతూ.." నేను జబర్దస్త్ కోసమే హైదరాబాద్ కి వచ్చి చాలా కష్టపడి  జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చాను. కిరాక్ ఆర్పి జబర్దస్త్ నుండి  వెళ్ళాక నాకు టీమ్ లీడర్ గా అవకాశం రావడంతో 18 స్కిట్లు చేశాను. అయితే కరోనా రావడంతో టీమ్ లీడర్ గా అవకాశం పోయింది. మళ్లీ ఆర్టిస్ట్ గానే కొన్ని స్కిట్లు చేశాను. ఆ తర్వాతే చాలా చేదు అనుభవాలు మొదలయ్యాయి.. చంటి అన్న టీమ్ లో ఆర్టిస్టుగా నన్ను వేయగా.. అక్కడ సరైన క్యారెక్టర్లు రాకపోవడంతో డైరెక్టర్ కి చెప్పి తాగుబోతు రమేష్ అన్న టీమ్ లో చేరాను" అంటూ తెలిపారు మహిధర్.


రెండు స్కిట్లు చేశానో లేదా ఒక రోజు ప్రాక్టీస్ కి వెళ్తే తనని తీసివేశారని చెప్పడంతో చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను.. ఈ విషయంపై డైరెక్షన్ టీమ్ ని అడగగా.. నీకు చెప్పలేదు ,నువ్వేమీ పట్టించుకోవు.. ఫీల్ అవ్వవని చెప్పలేదని చెప్పడంతో చాలా బాధపడ్డ అంటూ తెలిపారు.అందరూ ముందు మొహం మీదే తీసేశామని చెప్పడంతో సరైన ప్లేస్ కాదనిపించి బయటికి వచ్చాను అని తెలిపారు.  జబర్దస్త్ లో ఎలాంటి విషయాన్ని అయినా అసిస్టెంట్ డైరెక్టర్సే చూసేవారు. ఒకానొక విషయంలో తనకు అసిస్టెంట్ డైరెక్టర్ కి గొడవ అయ్యిందని.. అతని క్యాస్ట్ ఫీలింగ్ తో మరొక ఆర్టిస్ట్ ని సపోర్ట్ చేశారు..ఇవి అక్కడ చాలానే ఉన్నాయని తెలిపారు. దీంతో వాటిని చూసి నచ్చక బయటికి వచ్చానని మహిధర్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: