ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలోకి అనేక మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొద్ది మంది మాత్రమే ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంటున్నారు. ఇక అలా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో మాత్రమే కాకుండా వరుసగా మూడు సినిమాలతో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన మూడు సినిమాలతో విజయాలను అందుకొని హైట్రిక్ సక్సెస్ లను అందుకున్న బ్యూటీ ల సంఖ్య అత్యంత తక్కువగా ఉంది.

అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూడు సినిమాలతో అద్భుతమైన విజయాలను అందుకున్న ఓ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాత్రం తెలుగులో అవకాశాలే లేకుండా కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆ నటిమని మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి. ఈమె ఉప్పెన అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో కృతి శెట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని , అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు సినిమాలు వరుసగా విజయాలను అందుకున్నాయి. 

దానితో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూడు సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకుంది. దానితో ఒక్క సారిగా ఈ నటి క్రేజ్ తెలుగులో భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఈమెకి వరుస పెట్టి తెలుగు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యాయి. దానితో ఈమె క్రేజ్ చాలా వరకు పడిపోయింది. కృతి శెట్టి చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమాలు పెద్దగా ఏమీ లేవు. అలా మొదట వరుసగా మూడు విజయాలను అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం మాత్రం పెద్దగా అవకాశాలు లేకుండా కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks