టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్  చిత్రంగా పేరు సంపాదించింది పెద్ది.  హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఈ సినిమా రాబోతోంది. మొదట హీరో ఎన్టీఆర్ కు వినిపించిన ఈ కథ అనుకోకుండా రామ్ చరణ్ దగ్గరికి వెళ్లడం రామ్ చరణ్ కూడా ఓకే చెప్పడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. సుమారుగా 80 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పెద్ద పెద్ద చిత్రాలు కనీసం 100 లేదా120 రోజులు సినిమా షూటింగ్ చేసుకుంటాయి. మరి పెద్ద చిత్రాలు అయితే మరికొన్ని రోజుల సమయం పడుతుంది.


కానీ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా 70 నుంచి 75 రోజులు షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందట.. ఈ సినిమా కథ కూడా చాలా పెద్దది కావడం చేత సుమారుగా 150 రోజులకు పైగా ఈ సినిమా షూటింగ్ జరిపేలా చూస్తున్నారు.  ఈ సినిమా ఖర్చు కూడా సుమారుగా రూ. 300 కోట్లకు పైగా ఖర్చవుతున్నట్లు వినికిడి. హీరో రెమ్యూనరేషన్ కాకుండా రూ. 200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పైగా పెద్ది సినిమాకి లక్కీగా ఆదాయం కూడా బాగానే వస్తున్నట్లు వినిపిస్తోంది.

సినిమా డిజిటల్ రైట్స్ ఓటీటీ హక్కులు రూ.130 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్లు సమాచారం. అంతేకాదు సినిమా రన్ టైమును బట్టి మరో రూ.20 కోట్లు అదనంగా వచ్చేలా అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారట. ఆడియో రైట్స్ కి రూ. 20 కోట్లు , తెలుగు థియేట్రికల్ హక్కులు రూ.120 కోట్లకు పైగా అమ్ముడుపోయాయని , ఓవర్సీస్ రైట్స్ అన్ని కలుపుకొని సుమారుగా ఒక రూ. 40 కోట్ల వరకు వస్తాయని చిత్ర బృందం అంచనా వేస్తోంది. వీటికి తగ్గట్టుగా పాన్ ఇండియా సినిమా కావడంతో హిందీ డబ్బింగ్, శాటిలైట్, తెలుగు సాటిలైట్ రైట్స్ ఇంకా అమ్మాల్సి ఉంది. అయితే ఇందులో మాత్రం కొంత పెద్ది సినిమా వెనుకబడిందని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకుంటే రూ. 350 కోట్లకు పైగా పెద్ది సినిమాకి బిజినెస్ జరిగితేనే నిర్మాతలకు గిట్టుబాటు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: