యువతే దేశానికి పట్టుకొమ్మలు అంటారు.. అలాంటి యువత తలుచుకుంటే ప్రభుత్వాలను కూడా కూలగొట్టే అంతశక్తి సమకూరుతుందని నేపాల్ యువత చేసి చూపించారు. ప్రభుత్వంపై ఉన్న కసిని వెళ్లగక్కి చివరికి నేపాల్ ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. మరి ఇంతగా యువతకు ప్రభుత్వం పై విసుగు చెందడానికి కారణం ఏంటనేది చూస్తే సోషల్ మీడియాలో పలు రకాల కారణాలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 11 ఏళ్ల బాలిక.. ఆమెకు జరిగిన అన్యాయమే ప్రస్తుతం ప్రధానిని,మంత్రులను కూడా రాజీనామా చేసి దేశం వదిలి పారిపోయేలా చేసిందట.. మరి ఆ బాలికకు జరిగిన అన్యాయమేంటో చూసేద్దామా.. ఆగస్టు నెల ప్రారంభంలో ఒక 11 సంవత్సరాల బాలిక పాదచారుల క్రాసింగ్ వద్ద రోడ్డు క్రాసింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది.

 ఇదే సమయంలో స్పీడ్ గా వస్తున్నటువంటి ఒక మంత్రికి సంబంధించినటువంటి కారు ఆ బాలికను గట్టిగా ఢీ కొట్టింది. దీంతో ఆ బాలిక కాస్త దూరంలో పడిపోయింది. కానీ ఆ డ్రైవర్ కనీసం ఆగకుండా వెళ్ళిపోయాడు. ఇదంతా గమనించిన స్థానికులు ఆ కారును ఆపేసి ఆ డ్రైవర్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. కానీ ఆ డ్రైవర్ మంత్రి సాయంతో 24 గంటల్లో బయటకు వచ్చేసాడు. అంతేకాదు అక్కడే ఉన్న స్థానికులు ఆ బాలికను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స కూడా అందించారు. అయితే ఈ ప్రమాదకర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. చివరికి ఇది ప్రధాని, మంత్రి వరకు కూడా వెళ్లడంతో వాళ్ళు లైట్ తీసుకున్నారు. కానీ జనాలు మాత్రం దీన్ని కఠిన చర్యగా తీసుకొని ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఇలా యాక్సిడెంట్ చేసి వెళ్తే ప్రజలకు వారు ఏం భరోసా ఇస్తారని సోషల్ మీడియాలో ట్యాగ్ లైన్ పెట్టి విపరీతంగా వైరల్ చేశారు.

ప్రభుత్వంపై మంత్రులపై ప్రధానిపై విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. దీనికి తోడు ప్రభుత్వంలో తీవ్రమైన అవినీతి. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్,వాట్సాప్ లాంటివి బ్యాన్ చేసింది ప్రభుత్వం. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి యువకులు రాజకీయ నాయకుల పై దాడులు చేసి వారి ఇళ్లను తగలబెట్టారు. చివరికి ప్రధాని కెపి శర్మ ఓలి రాజీనామా చేశారు. ఆ వెంటనే మంత్రులు రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది. ఈ విధంగా ప్రభుత్వానికి యువతకు మధ్య ఘర్షణ ఏర్పడి ఇప్పటికే  ఎంతో మంది మరణించారు వేలాదిమంది గాయాలపాలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: