తేజ సజ్జా, కార్తిక్ ఘట్టమనేని కలయికలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'మిరాయ్', ఈ నెల 12వ తేదీన భారీ ఎత్తున విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బుకింగ్స్ ఊపందుకోవాల్సి ఉన్నా, ప్రస్తుతానికి పర్వాలేదనే స్థాయిలో ఉన్నాయి.

'హను-మాన్' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తేజ సజ్జాకు మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. 'మిరాయ్' సినిమా బుకింగ్స్ నెమ్మదిగా మొదలైనా, తేజ సజ్జాకు ఉన్న క్రేజ్ కారణంగా ఈ బుకింగ్స్ గణనీయంగా పుంజుకుంటాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో వస్తున్న స్పందన చూస్తుంటే, "బుకింగ్స్ విషయంలో తేజ సజ్జా పవర్ చూపిస్తున్నాడు" అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు, ఈ సినిమా టికెట్ ధరలు చాలా తక్కువగా ఉండటం ప్రేక్షకులకు మరింత చేరువయ్యే అంశం. తక్కువ రేట్లతో ఎక్కువ మంది థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు పూర్తిస్థాయిలో బుకింగ్స్ మొదలయ్యాక, 'మిరాయ్' ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ప్రచార చిత్రాలు చెబుతున్నాయి. ఇది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఈ మధ్య కాలంలో పీపుల్స్ మీడియా బ్యానర్ కు సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే.  మిరాయ్  సినిమాతో ఆ లోటు తీరుతుందని అభిమానులు  భావిస్తున్నారు. మిరాయ్ సినిమా ఫుల్ రన్  కలెక్షన్లు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి. హనుమాన్ రికార్డులను సైతం ఈ సినిమా  బ్రేక్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: