
ఇక మరోవైపు ప్రముఖ నిర్మాణ సంస్థతో చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా కూడా పెద్ద చర్చనీయాంశమైంది. మొదట కొన్ని అప్డేట్స్ ఇచ్చినప్పటికీ, తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి సమాచారం రాకపోవడంతో మిస్టరీగా మారింది. దీనికి కూడా ఆర్థిక ఇబ్బందులే కారణమని టాక్ వస్తోంది. అదేవిధంగా ఇటీవల ఓ ఫెస్టివల్ పేరుతో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా ఇప్పటి వరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఫిల్మ్ నగరంలో వినిపిస్తోంది. కానీ ఫైనాన్షియల్ ఇష్యూలు అడ్డంకిగా మారడం వల్లే ఆలస్యం జరుగుతోందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ హీరో మాత్రం తన రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి తగ్గింపు ఇవ్వడం లేదని .. కథ, కథనాలు పట్టించుకోకుండా రెమ్యునరేషన్ మీదే పట్టుబడుతున్నాడట. నిర్మాతలు ఎంత ఇబ్బందులు పడుతున్నా, తాను చెప్పిన పారితోషికం తప్ప మరొక రూపాయి తగ్గించరాదని పట్టుబడుతున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆ హీరో కెరీర్ పరంగా వెనకపడిపోతున్నాడని అంటున్నారు.