తెలుగు సినీ పరిశ్రమలో అదిరి పోయే రేంజ్ స్టార్ ఈమేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరో లలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్ కూడా ఉంటారు. వీరిద్దరూ ఎన్నో సంవత్సరాల నుండి అద్భుతమైన విజయాలను అందుకుంటు ఇప్పటికి కూడా తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం వీరిద్దరి కాంబో లో ఓ సినిమా మిస్ అయింది. ఇక ఆ సినిమాను వేరే ఇద్దరు హీరోలతో రూపొందించగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంతకు ఆ సినిమా ఏది ..? ఎందుకు వీరిద్దరూ ఆ సినిమాను వదులుకున్నారు ..? అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రభు , కార్తీక్ హీరోలుగా ఘర్షణ అనే సినిమాని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. మణిరత్నం మొదట ఈ సినిమాను ప్రభు ,  కార్తీ హీరోలుగా కాకుండా మన తెలుగు స్టార్ హీరో లు అయినటువంటి నాగార్జున , వెంకటేష్ లతో రూపొందించాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా ఈ ఇద్దరిని కలిసి ఘర్షణ మూవీ కథ ను కూడా వివరించాడట. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ ఆ సమయంలో ఆ సినిమాలో నటించలేము అని చెప్పారట. దానితో మణిరత్నం అదే కథను ప్రభు , కార్తీక్ కి వినిపించగా వారు ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలా నాగార్జున , వెంకటేష్ రిజెక్ట్ చేసిన స్టోరీలో ప్రభు , కార్తీక్ హీరోలుగా నటించగా ఆ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: