ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల టేస్ట్ చాలా వరకు మారింది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రేక్షకులు పెద్ద హీరో నటించిన సినిమా , పెద్ద దర్శకుడు , పెద్ద నిర్మాతలు నిర్మించిన సినిమాలను చూడడానికి అత్యంత ఇష్ట పడుతూ ఉండేవారు. కానీ ప్రస్తుతం మాత్రం ప్రేక్షకులు సినిమాలో ఎంత పెద్ద స్టార్ హీరో నటించాడు ... దానిని ఎవరు నిర్మించారు ... ఎవరు ఆ సినిమాకు దర్శకత్వం వహించారు అనే దానిని పెద్దగా పట్టించుకోవడం లేదు. సినిమా విడుదల అయిన తర్వాత ఆ మూవీ కి కనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఆ సినిమాను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు.

దానితో ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ తో రూపొంది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అలా తక్కువ బడ్జెట్ తో రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్లను వసూలు చేసిన సినిమాలలో సూ ఫ్రమ్ సో మూవీ ఒకటి. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకి విడుదల అయిన తర్వాత మంచి టాక్ రావడంతో ఈ మూవీ భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాను కేవలం 6 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 120 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. 

ఈ స్థాయి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తాజాగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను జియో హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ప్రస్తుతం జియో హాట్ స్టార్ ఓ టి టి సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ సినిమా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో ఏ రేంజ్ రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: