
అలాగే హైదరాబాదులోని నిజామాబాద్ జిల్లాలో ఒక అనుమానిడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, జార్ఖండ్, రాంచి పోలీసులు సంయుక్తంగానే ఈ ఆపరేషన్ లో పాల్గొని మరీ ఈ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం ప్రకారం వల్ల వివిధ రాష్ట్రాలలో సుమారుగా 12 కు పైగా ప్రాంతాలలో కేంద్ర ఏజెన్సీలు ప్రత్యేకించి మరి నిర్వహించినటువంటి దాడులలో 8 మంది అనుమానిత ఉగ్రవాదులు బయటపడ్డారు. అయితే వీరి వద్ద నుంచి అనేక అనుమానిత వస్తువులు, పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఉగ్రవాద నిరోధక చర్యలలో భాగంగా ఎన్ఐఏ, ఢిల్లీ స్పెషల్ పోలీసులతో పాటుగా మరి కొన్ని బృందాలు నిఘా ఉంచాయి. ఈ క్రమంలోనే రాంచీ లో అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారని గుర్తించి హసన్ డ్యానిష్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టి, ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. ఈ సమయంలోనే తెలంగాణలో బోధన్ పట్టణంలో ఎన్ఐఏ అధికారులు కూడా సోదాలు చేయగా ఉగ్రవాద మూలాలు కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ ఉగ్రవాదులకు ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాల పైన కూడా ప్రత్యేకించి మరీ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.