కొంత కాలం క్రితం రిషబ్ శెట్టి హీరో గా నటించి ఆయనే స్వయంగా కాంతారా అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ కి ఫ్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 అనే సినిమాను మేకర్స్ రూపొందిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ నుండి మేకర్స్ పెద్దగా ప్రచార చిత్రాలను విడుదల చేయకపోయినా కాంతార సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ ఓ టీ టీ డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఏకంగా 125 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి కనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ సినిమా సూపర్ సాలిడ్ లాభాలను అందుకునే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి.

మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో , ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను కూడా అమ్మి వేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యొక్క నైజాం హక్కులను ఈ మూవీ యూనిట్ అమ్మి వేసింది. ఈ సినిమా నైజాం హక్కులను మైత్రి సంస్థ వారు దక్కించుకున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: