టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు ఈ మధ్య ఎక్కువగానే విడుదలవుతూ బాగానే సక్సెస్ అవుతున్నాయి. ముఖ్యంగా కంటెంట్ క్వాలిటీ ఉంటే కచ్చితంగా చిన్న సినిమా అయినా కూడా సక్సెస్ చేస్తున్నారు ప్రేక్షకులు. తక్కువ బడ్జెట్ తో ఎన్నో అద్భుతమైన చిత్రాలను కూడా తెరకెక్కిస్తున్నారు. అలా తాజాగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం మిరాయ్. ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని రూపొందించగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లో ఇవే హైలెట్గా నిలిచాయి. ఈ చిత్రాన్ని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమ తదుపరిచిత్రాల విషయంలో కూడా వీటినే ఫాలో అవుతున్నారట.


ప్రస్తుతం ప్రభాస్ తో "ది రాజా సాబ్" సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పైన కూడా ప్రభాస్ అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. మీరాయ్ సినిమా విఎఫ్ఎక్స్ అవుట్ ఫుట్ విషయంలో సక్సెస్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు. ఇందుకు కారణం పీపుల్ మీడియా దగ్గర విఎఫ్ఎక్స్ టీమ్ సపరేట్ గా ఉండడమే.. మిరాయ్ చిత్రంలో వారు పడ్డ కష్టం, నైపుణ్యం చాలా స్పష్టంగా కనిపించింది.

అందుకే ప్రభాస్ అభిమానులు కూడా రాజా సాబ్ విషయంలో చాలా గ్రాండ్ విజువల్స్ ఉంటాయని నమ్ముతున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ నిర్మాతలలో ఒకరు చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. రాజా సాబ్ సినిమాలో హ్యారీ పోటర్ స్థాయి విజువల్స్ కనబడతాయని  మాట్లాడారు. ఇక ఆయన చేసిన కామెంట్స్ తో ఫ్యాన్స్ చాలా ఖుషి అవుతున్నారు. మీరాయ్ సినిమా VFX సక్సెస్ వల్ల రాజా సాబ్ సినిమా విజువల్స్ పైన సరికొత్త అంచనాలు క్రియేట్ అయ్యేలా చేస్తోంది. మరి ఏ మేరకు అభిమానులను రాజా సాబ్ ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: