ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలో రోజుకొక వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో భాగంగా కూటమి నేతల మధ్య గొడవలు , గోలలు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గంలో టిడిపిలో గ్రూపుల గోల మొదలైనట్లుగా వినిపిస్తున్నాయి. 2014లో టిడిపి నేత కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి పోటీ చేసి మరి గెలిచారు. 2019లో అదే నియోజకవర్గంలో నుంచి పోటీ చేయగా ఓడిపోయారు. కోడెల శివప్రసాద్ ఆకాల మరణంతో అక్కడ టిడిపి ఇన్చార్జ్ పదవి ఖాళీ కావడంతో ఆ పదవి కోసం టిడిపిలో మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు, కోడెల కొడుకు శివరాం, మరి కొంతమంది నేతలు ఇలా ఎవరికి వారు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు.


2024 ఎన్నికల ముందు సత్తనపల్లి టికెట్ కోసం కోదెల కొడుకు శివరాం, వైవి ఆంజనేయులతోపాటు మరి కొంతమంది నేతలు పోటీపడ్డారు. ఈ విషయాన్ని గమనించిన సీఎం చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగానే  వ్యవహరిస్తూ.. సత్తెనపల్లి నియోజకవర్గానికి టిడిపి పార్టీ అభ్యర్థిగా  కన్నా లక్ష్మీనారాయణను బరిలో దింపగా.. తన ప్రత్యర్థి అయిన అంబాటి రాంబాబు మీద మంచి విజయాన్ని అందుకున్నారు లక్ష్మీనారాయణ. ముఖ్యంగా అక్కడ అంతా కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం చేత అందరూ కలిసిపోతారనుకున్నప్పటికీ.. చివరికి ఆయన ఆశించింది ఒకటైతే ఇప్పుడు జరుగుతున్నది  మరొకటి.  ఎమ్మెల్యేగా ఒకరు సపోర్ట్ చేస్తే మరొకరు వ్యతిరేకంగా మారుతున్నారు. ముఖ్యంగా ఎలాంటి విషయాలలో తాను ఇన్వాల్వ్ అవ్వకుండా తమకులానికి చెందిన నాయకుడు దరువూరి నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు ఎమ్మెల్యే.


మొన్నటి వరకు పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని దరువూరికి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి అంటూ సత్తెనపల్లి టిడిపిలో మరి కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేగా పనిచేసిన వైవి ఆంజనేయులు వర్గం అలాగే కోడెల  శివరాం వర్గాలు, దరువురికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంపై వారి వర్గానికి చెందిన వారే వ్యతిరేకిస్తున్నారట దరువూరిని. ముఖ్యంగా దరువూరి చేస్తున్న సెటిల్మెంట్స్ భూ వ్యవహారంలో చేస్తున్న పనుల వల్ల, రియల్ ఎస్టేట్ వ్యాపార, వెంచర్స్ గురించి ఈయన పైన చాలా వ్యతిరేకత ఉన్నదట.DNR వ్యవహార సైలిలో చేస్తున్న పనుల వల్ల కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇలా ఎన్నో విమర్శలు వివాదాస్పదంగా మారుతూ ఉండడంతో ఈ విమర్శలు అన్నీ కూడా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకే తలనొప్పిగా తయారవుతున్నాయట. గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టాలని తాను ప్రయత్నిస్తున్నప్పటికీ తనకే మొదటికే మోసం వచ్చేలా కనిపిస్తోందని కన్న కంగారు పడుతున్నట్లు సమాచారం. మరి సత్తెనపల్లి రాజకీయ పరిణామాలు ఎలా టర్న్ తీసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: