
‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం మేకర్స్ భారీ బడ్జెట్ కేటాయించి, అనిల్ రావిపూడి కూడా తన సత్తా చాటేలా ఈ చిత్రాన్ని ఎంటర్టైనింగ్‌గా తీర్చిదిద్దడానికి బిజీగా ఉన్నాడు. అయితే, నయనతార ప్రవర్తన కారణంగా సినిమా షూటింగ్‌లో అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సెట్‌లపై నయనతార ప్రవర్తనపై పలు కామెంట్లు వస్తున్నాయి. షూటింగ్ షెడ్యూల్ రెడీ అయినప్పటికీ ఆమె సమయానికి సెట్‌కు రాకపోవడం, షూటింగ్ సెట్స్ కి తన ఇద్దరు పిల్లలను తీసుకువచ్చి వారితో టైమ్ గడపడం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని యూనిట్ టాక్. పిల్లలకి ఫీడ్ చేయడం, వాళ్ల అవసరాలు చూసుకోవడం పేరుతో ఆమె ఎక్కువ టైమ్ తీసుకోవడం వల్ల చిత్రీకరణ జాప్యం అవుతుందట. ఈ కారణంగా చిత్రబృందానికి తలనొప్పి పెరుగుతోందని సమాచారం.
ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి లెజెండరీ స్టార్ సెట్‌లో ఉన్నా కూడా నయనతార ప్రవర్తనలో పెద్ద మార్పు లేదని, తన హెడ్‌వెయిట్ ప్రవర్తనతో టీమ్‌ను ఇబ్బంది పెడుతోందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో నయనతారపై భారీ స్థాయిలో నెగిటివిటీ పెరుగుతోంది. “నయనతారతో సినిమా చేయడం అంత సులభం కాదు” అని చాలామంది ముందే చెప్పిన మాటలు నిజమవుతున్నాయని నెటిజన్లు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి కూడా ఈ పరిస్థితుల్లో కొంత ఇబ్బందిగా ఫీలవుతున్నాడని ఫిలింనగర్ టాక్. “చిరంజీవి లాంటి మెగా స్టార్‌తో సినిమా చేస్తున్నా కూడా నయనతార తీరే ఇలాంటిదా?” అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. షూటింగ్‌ను ఆలస్యం చేస్తూ, టీమ్ మొత్తాన్ని ఇబ్బంది పెట్టడం వృత్తిపరంగా సరైన పని కాదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే చిరంజీవి ఈ సినిమా కోసం చాలా శ్రమ పడుతున్నాడు. ఆయన ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాను భారీ హిట్‌గా మలచాలనే మేకర్స్ ఆరాటపడుతున్నారు. అయితే నయనతార వల్ల జరుగుతున్న జాప్యాలు, సెట్‌లో జరుగుతున్న ఇబ్బందులు ఈ ప్రాజెక్ట్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఫిలింనగర్‌లో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. “అలా అయితే షూటింగ్‌కి రాను” అనే మాటలతో నయనతార ప్రవర్తన సినిమాకి ఎంత వరకూ ఇబ్బంది కలిగిస్తుందో చూడాలి. అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం రాకూడదని కోరుకుంటున్నారు.