
అంతేకాకుండా ఎవరైతే PPP కింద తీసుకొనే కాంట్రాక్టర్లకు కూడా వార్నింగ్ ఇచ్చేవారు.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ స్వాధీనం చేసుకుంటామంటూ జగన్ హెచ్చరించారు. కానీ కూటమి నేతలలో మంత్రిగా ఉన్న సత్య కుమార్ మాత్రం PPP కి ఇచ్చేయమని చెబుతున్నారు.. దీనికి తోడు కొంతమంది టీడీపీ నేతలు మాత్రం నిర్మాణంలో లేదా పునాదులు తీసినటువంటి స్థలాల వద్దకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలు, జగన్ ఏం కట్టలేదంటూ చూపెడుతున్నారు.. వైసీపీ వాళ్లు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు కట్టి పూర్తి చేసినటువంటి కళాశాలలను చూపిస్తూ అలాగే ఇంకా నిర్మాణ దశలో ఉన్నటువంటి కళాశాలను చూపిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో కూడా పెద్ద వార్ జరుగుతోంది. జగన్ హయాంలో కట్టిన వైద్య కళాశాలలో 4 కళాశాలలో ప్రస్తుతం విద్యార్థులు కూడా ఉన్నారు. మరో నాలుగు కళాశాలలు పూర్తి అయినా భవనాలు ఉన్నాయి.ఇలా ఎవరికి అనుకూలంగా వారు సోషల్ మీడియాలో నేతల మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది.
కూటమి మంత్రులు మాత్రం పిపిపి మోడల్ లోని మెడికల్ కాలేజీ లను ఏర్పాటు చేస్తామంటు తెలుపుతున్నారు. మాజీ సీఎం జగన్ మాత్రం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే తాను రంగంలోకి దిగుతాను అంటూ హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఖచ్చితంగా కూటమి పైన వ్యతిరేకత మొదలవుతుందని అంశంతోనే జగన్ అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ విషయం పైన సీఎం చంద్రబాబు పురాలోచన చేస్తారేమో చూడాలి.