బాలీవుడ్ హీరోయిన్ గా పేరు సంపాదించిన కరిష్మా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. తాజాగా ఈ నటి కదులుతున్న రైలు నుంచి దూకేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది కరిష్మా శర్మ. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.


కరిష్మా శర్మ నిన్నటి రోజున షూటింగ్ కోసమని వెళ్తూ.. రైలులో చర్చి గేట్ వద్దకు వెళ్లాలనుకున్నాను. అయితే ఆ సమయంలో స్టేషన్ కు వెళ్లి ట్రైన్ ఎక్కాను.. వెంటనే రైలు వేగంగా ముందుకు వెళ్తోంది. తన స్నేహితులు ఇంకా ఎవరూ రాలేదని విషయాన్ని తాను గమనించాను.. అప్పుడు తాను చీరలో ఉన్నానని అయినా కూడా ధైర్యం చేసి రైలులో నుంచి దూకేయగా తలకు, వెన్నుముకకు తీవ్రమైన గాయాలయ్యాయని తెలియజేసింది. హుటా హుటిగా హాస్పిటల్ కి వెళ్ళగా..MRI స్కానింగ్ చేసిన వైద్య బృందం కొద్ది రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్పారు.



ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి చాలా నొప్పితో బాధపడుతున్నాను.. మీ ప్రేమాభిమానాలే తనను కోలుకునేలా చేశాయి.. దయచేసి నాకోసం ఎవరూ కూడా ప్రార్థించకండి అంటూ సోషల్ మీడియా వేదికగా కరిష్మా శర్మ ఒక స్టోరీని పంచుకుంది. కరిష్మా శర్మ ప్యార్ కా పంచనామా 2, హోటల్ మిలన్, ఏక్ విలన్ రిటర్న్స్ ఇలాంటి చిత్రాలలో నటించింది. అలాగే రాగిణి ఎమ్ఎమ్ఎస్ తదితర వెబ్ సిరీస్లలో కూడా నటించింది కరీష్మా శర్మ. అలాగే బుల్లితెర పైన కూడా పవిత్ర రిస్తా, కామెడీ సర్కిల్ తదితర సీరియల్స్లలో కూడా నటించింది. ప్రస్తుతం కరిష్మా శర్మకు ఇలాంటి ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే అభిమానులు ఆందోళన చెందగా తన ఆరోగ్యం పై సోషల్ మీడియా వేదికగా అప్డేట్ ఇవ్వడంతో కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: