తాజాగా జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో  కాంగ్రెస్, బీజేపీ మధ్య విపరీతమైనటువంటి పోటీ ఏర్పడింది.. ఎలక్షన్ ముగిసే వరకు నువ్వా నేనా అంటూ తలపడ్డారు. చివరికి ఈ ఎన్నికల్లో  ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి  రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఇదే తరుణంలో ఇండియా కూటమి నుంచి బరిలోకి దిగినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాత్రం  ఓటమిపాలయ్యారు. ఇందులో ఏ కూటమికి ఎన్ని ఓట్లు వచ్చాయి. అసలు ఇండియా కూటమి నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందా? దానికి కారకులు ఎవరు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.. భారత 17 ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నిక కాబడ్డారు. ఈ ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ కు 452ఓట్లు వచ్చాయి. ఈయన సుదర్శన్ రెడ్డిపై 150 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఈ ఎన్నికలో మొత్తం 767 మంది ఎంపీలు ఓటు వేశారు. 

ఇందులో కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పడ్డాయి. ఇంకా 17 మంది ఎంపీలు గైర్హాజరవ్వగా, 15 ఓట్లు చెల్లలేదు.  అలాంటి ఈ సమయంలో ఇండియా కూటమి నుంచి కూడా కొంతమంది అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీతో సహా మరి కొన్ని పార్టీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఆప్ లో బిజెపికి అనుకూలంగా ఉన్న ఒక మహిళ ఎంపీతో పాటు కనీసం నలుగురు ఎన్డీఏ  అభ్యర్థికి ఓటు వేశారని, ఇందులో ఒక్కొక్కరికి 20 కోట్ల వరకు డబ్బులు ఇవ్వజూపారని ఆరోపణలు వస్తున్నాయి.

అయితే ఇదే విషయమై ఆప్ నేత సౌరబ్ భరద్వాజ్ స్పందిస్తూ.. ఏ ఎంపి ఎవరికి ఓటు వేశారు అనే విషయం ఎన్నికల సంఘానికి మాత్రమే తెలుస్తుందని, ఎవరు క్రాస్ ఓటింగ్ వేశారో ఎన్నికల సంఘమే బయటపెడుతుందని  అన్నారు. అంతేకాకుండా ఎవరు క్రాస్ ఓటింగ్ వేశారో తేల్చేందుకు దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి డిమాండ్ చేశారు. ఇదే తరుణంలో తమ వైపు నుంచి ఎలాంటి క్రాస్ ఓటింగ్ జరగలేదని ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. ఈ విధంగా ఇండియా కూటమిలో క్రాస్ ఓటింగ్ విపరీతమైనటువంటి చిచ్చు పెట్టిందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ  ఎన్డీఏ అభ్యర్థికి మాత్రం అత్యధికంగా ఓట్లు పడ్డాయి అనేది ప్రస్తుత ఫలితం చూస్తేనే అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: