తమిళ నటుడు అజిత్.. కమల్ హాసన్, రజినీకాంత్ తర్వాత తమిళంలో అంతటి గుర్తింపు తెచ్చుకున్న హీరో.. ఈ హీరో తన సినిమాలతో కోలీవుడ్లో మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. అయితే అలాంటి అజిత్ సినిమాల్లో హీరోయిన్ గా రాణించిన శాలిని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ హీరోయిన్ కంటే ముందే మరో హీరోయిన్ హీరోయిన్ హీరా రాజగోపాల్ ని ప్రేమించారు. వీరిద్దరి మధ్య ప్రేమ ఎంతలా ఉండేది అంటే పెళ్లి వీరు చేసుకుంటారని ఇండస్ట్రీ జనాలంతా మాట్లాడుకున్నారు. కానీ చివరికి వీరి పెళ్లి జరగలేదు. ఇక అజిత్ హైరా రాజగోపాల్ ల పెళ్లి జరగకపోవడానికి కారణం హీరా తల్లి అంటుంటారు. అయితే అజిత్ హీరో కాబట్టి ఆయన అందానికి ఎంతోమంది మామూలు అమ్మాయిలతో పాటు హీరోయిన్లు కూడా ప్రేమలో పడిపోతూ ఉంటారు. 

అలా అజిత్ ని హీరా రాజగోపాల్, శాలినిలు మాత్రమే కాదు మరో హీరోయిన్ కూడా ప్రేమించిందట. కానీ ఆ హీరోయిన్ ని చెల్లి అని పిలిచి షాకిచ్చారట. మరి ఇంతకీ అజిత్ ని ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే మహేశ్వరి..సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్న మహేశ్వరి శ్రీదేవి అక్క కూతురిగా ఫేమస్ అయింది.అలా మహేశ్వరి పెళ్లి, తిరుమల తిరుపతి వెంకటేశా, మా బాలాజీ,గులాబీ, జాబిలమ్మ పెళ్లి వంటి సినిమాల ద్వారా హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించింది. అయితే అలాంటి మహేశ్వరి తాజాగా జగపతిబాబు జయమ్ము  నిశ్చయమ్మురా సెలబ్రిటీ టాక్ షోలో అజిత్ గురించి చెబుతూ నేను అజిత్ తో కలిసి రెండు సినిమాలు చేశాను.
ఆ సినిమాలు చేసే సమయంలో అజిత్ ని చూసి ప్రేమలో పడిపోయా. అయితే నాకు అప్పటికే అజిత్ అంటే చాలా ఇష్టం.మీరే నా క్రష్ అని అజిత్ కి ఒక రోజు చెప్పాలనుకున్నా.కానీ ఈ విషయం అజిత్ కి చెప్పేలోపే ఆయన నా దగ్గరికి వచ్చి నువ్వు నాకు చెల్లి లాంటి దానివి..నీకు ఏ సహాయం కావాలన్నా ఈ అన్న ఉన్నాడని మర్చిపోకు..ఏదైనా సరే మొహమాటం లేకుండా అడుగు అంటూ చెప్పారు.ఆయన పిలిచిన పిలుపుతో నా నోటి మాట పడిపోయింది. అన్ని రోజుల వరకు క్రష్ అనుకున్న అజిత్ ఒక్కసారిగా వచ్చి నీ అన్న లాంటి వాడిని అని చెప్పడంతో షాక్ అయిపోయాను అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది మహేశ్వరి.

మరింత సమాచారం తెలుసుకోండి: