టాలీవుడ్‌లో ఈ వారం బాక్సాఫీస్‌ను షేక్ చేయ‌డానికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ OG సినిమా వ‌స్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఏపీ ఉప ముఖ్య‌మంత్రి .. ప‌వ‌న్ సినిమా కావ‌డంతో మ‌రే సినిమా పోటీకి సిద్ధంగా లేదు. ఓజీ రావ‌డానికి ప‌ది రోజుల గ్యాప్ ఉండ‌డంతో ఈ గ్యాప్‌లో వ‌చ్చేందుకు బ్యూటీ, భ‌ద్ర‌కాళి సినిమాలు పోటీ ప‌డుతున్నాయి. ద‌ర్శ‌కుడు మారుతి ప్రోత్సాహంతో .. ఆయ‌న దిశానిర్దేశంలో తెర‌కెక్కిన సినిమా బ్యూటీ. జీ సంస్థ ఈ సినిమా నిర్మించింది. తండ్రి , కూతుర్ల అనుబంధంతో త‌యారైన సినిమా ఇది. పాట‌లు జ‌నంలోకి బాగానే వెళ్లాయి. ఈ మ‌ధ్య‌లోనే లిటిల్ హార్ట్స్ సినిమా వ‌చ్చి సూప‌ర్ హిట్ కొట్ట‌డంతో ఇప్పుడు బ్యూటీ సినిమా మీద కూడా అంచ‌నాలు ఉన్నాయి.


ఇక ‘బిచ్చ‌గాడు’ ఫేమ్ విజ‌య్ ఆంటోనీ.. ఇప్పుడు ‘ భ‌ద్ర‌కాళి ’ని రంగంలోకి దింపాడు. ఇదో పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామా గా తెర‌కెక్కింది. స‌హ‌జంగానే విజ‌య్ ఆంటోనీ సినిమాల‌లో క‌థ‌లు బ‌లంగా ఉంటాయి. కొత్త పాయింట్ల‌తో ఆక‌ట్టుకుంటాడు. విజ‌య్ సినిమాలు ఎప్పుడు బిచ్చ‌గాడులా షాక్ ఇస్తాయో చెప్ప‌లేం కాబ‌ట్టి ఈ సినిమా కూడా క్లిక్ అవుతుంద‌న్న ఆశ‌లు టాలీవుడ్‌లో కొంద‌రికి ఉన్నాయి. ఇక గ‌త వారం రిలీజ్ అయిన మిరాయ్ జోరు ఈ వారం కూడా కొన‌సాగ‌నుంది. ఇక లిటిల్ హార్ట్స్ ఫుట్ ఫాల్స్ ఇంకా బాగున్నాయి.


ఓజీకి ముందు లిటిల్ హార్ట్స్, ‘మిరాయ్’ లాంటి సినిమాలు హిట్ అవ్వ‌డంతో టాలీవుడ్‌లో థియేట‌ర్ల‌కు కొత్త క‌ళ వ‌చ్చిన‌ట్టైంది. వ‌చ్చేవారం ఓజీ కూడా సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంటే టాలీవుడ్ బాక్సాఫీస్ అదిరిపోతుంద‌న‌డంలో సందేహం లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: